'ఆదిపురుష్‌`లో న‌టించే హీరోయిన్ల లిస్ట్‌లో కొత్త‌గా చేరిన ముద్దుగుమ్మ‌!

Kriti Sanon To Play Sita in Prabhas Adipurush

ఒక స్టార్ హీరో సినిమా ఎనౌన్స్ చేయ‌గానే ముందుగా త‌లెత్తే ప్ర‌శ్న అందులో హీరోయిన్ ఎవ‌రు? అని. ర‌క‌ర‌కాల పేర్లు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతూ ఉంటాయి. ప్ర‌భాస్ లాంటి ప్యాన్ ఇండియా హీరో అయితే ఇక ఆ ఎక్స్‌పెక్టేష‌న్స్‌కి అంతే ఉండ‌దుగా. ఎవ‌రికి తోచిన పేరును వారు ఎనౌన్స్ చేసేస్తూ ఉంటారు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తున్న రాధేశ్యామ్‌లో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత మ‌హాన‌టి ఫేం నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో సి.అశ్వినీద‌త్ నిర్మించే సోషియో ఫాంట‌సీ మూవీలో దీపికా ప‌దుకొనే క‌న్‌ఫ‌ర్మ్ అయిన‌ట్టు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న ఆదిపురుష్ సినిమాలోనే హీరోయిన్ ఇంకా ఫైన‌ల్ అవ్వ‌లేదు.

ఆ సినిమాలో ప్ర‌భాస్ రాముడిగా న‌టిస్తుండ‌గా సీత ఎవ‌రు అనేది పెద్ద స‌స్పెన్స్‌గా మారింది. ఇప్ప‌టివ‌ర‌కు కీర్తి సురేష్‌, కియారా అద్వానీ పేర్లు వినిపించాయి. అయితే ఆ సినిమాలో హీరోయిన్‌ని ఇంకా క‌న్‌ఫ‌ర్మ్ చెయ్య‌లేద‌ని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. దాంతో కొంత‌కాలం సోష‌ల్ మీడియాలో ఆదిపురుష్‌లో హీరోయిన్ ఎవ‌రు అనే చ‌ర్చ ఆగింది. మ‌ళ్లీ ఇప్పుడు ఆ డిస్క‌ష‌న్ తిరిగి మొద‌లైంది. కొత్త‌గా కృతి స‌న‌న్ పేరు వినిపిస్తోంది. మ‌హేష్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన 1 నేనొక్క‌డినే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కృతి ఆ త‌ర్వాత నాగ‌చైత‌న్యతో క‌లిసి దోచెయ్ చిత్రంలో న‌టించింది. ఈ రెండు సినిమాలు ఆమెకు హీరోయిన్ గుర్తింపును తెచ్చిపెట్ట‌లేక‌పోయాయి

అయితే బాలీవుడ్‌లో మాత్రం వ‌ర‌స‌గా సినిమాలు చేస్తూ బిజి అయిపోయింది. 2014లో తెరంగేట్రం చేసిన కృతి ఆ త‌ర్వాత సంవ‌త్స‌రానికి ఒక‌టి, రెండు సినిమాలు చేస్తూ వ‌చ్చింది. గ‌త సంవ‌త్స‌రం అంటే 2019లో మాత్రం ఏకంగా ఆరు సినిమాల్లో హీరోయిన్‌గా న‌టించింది. ప్ర‌స్తుతం మిమి అనే సినిమా చేస్తోంది. తెలుగులో రెండు సినిమాలు చేసిన త‌ర్వాత అడ్ర‌స్ లేకుండా పోయిన కృతి పేరు ఆదిపురుష్ సినిమాకి ఎందుకు వినిపిస్తుందో ఎవ్వ‌రికీ అర్థం కావ‌డం లేదని, ఇదంతా సోష‌ల్ మీడియాలో ఊహాగానాలు మాత్ర‌మేన‌ని కొంద‌రు కొట్టిపారేస్తున్నారు. అయితే నిజం ఏమిట‌నేది తెలుసుకోవాలంటే చిత్ర యూనిట్ ఆ హీరోయిన్ పేరు ప్ర‌క‌టించే వ‌ర‌కు ఆగాల్సిందే.

 


                    Advertise with us !!!