తెలంగాణలో మరో 1,436 కేసులు

Coronavirus Positive Cases in Telangana

తెలంగాణ రాష్ట్రంలో తాజాగా 41,043 పరీక్షలు నిర్వహించగా 1,436 మందికి పాజిటివ్‍ తేలినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‍లో పేర్కొంది. ఇప్పటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా 38,30,503 మంది పరీక్షలు చేయగా, మొత్తం పాజిటివ్‍ కేసుల సంఖ్య 2,22,111కి చేరింది. ఒక్కరోజులో 2,154 మంది కోలుకోగా మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,98,790 చేరింది. తాజాగా ఆరుగురి మృతితో మొత్తం మరణాలు 1,271కి చేరాయి. రాష్ట్రంలో మిలియన్‍ జనాభాకు 1,02,915 మందికి పరీక్షలు నిర్వహించారు.