ఏపీలో 3,986 మందికి కరోనా

3986 new corona positive cases in ap

ఆంధప్రదేశ్‍ రాష్ట్రంలో కరోనా పరీక్షలు ఆదివారం ఉదయం నాటికి 70,66,203కి చేరాయి. గడిచిన 24 గంటల్లో 74,945 పరీక్షలు నిర్వహించగా 3,986 మందికి పాజిటివ్‍గా నిర్ధారణ అయినట్టు వైద్యారోగ్యశాఖ బులెటిన్‍లో పేర్కొంది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‍ కేసుల సంఖ్య 7,83,132కి చేరింది. ఒక్కరోజులో 4,591 మంది కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 7,40,229కి చేరింది. తాజాగా 23 మంది మృతితో మొత్తం మరణాలు 6,429కి చేరాయి. ఇంకా యాక్టివ్‍ కేసులు 36,474 ఉన్నాయి.

 


                    Advertise with us !!!