pawan kalyan ready for vakheel saab shooting

పవన కళ్యాణ్ షూటింగ్ కు రెడీ అయిపోయాడు. కరోనా తగ్గే వరకు వెయిట్ చేద్దామనే ఆలోచనలో ఉన్న వకీల్ సాబ్ ఇప్పుడు సెట్స్ లో అడుగుపెట్టడానికి ప్రిపేర్ అవుతున్నాడు. కరోనా కాలంలోనే రీఎంట్రీ ప్రాజెక్ట్ ను పూర్తి చేయబోతున్నాడు పవన్ కళ్యాణ్. లాక్ డౌన్ సమయంలో కరోనా తగ్గేవరకు షూటింగ్ కు వెళ్లడం కష్టమని చెప్పాడు పవన్ కళ్యాణ్. అయితే ఇప్పుడు కరోనా ప్రభావం అంత ఈజీగా తగ్గదని తెలిసిపోయింది. దీంతో వెయిట్ చేయడం కంటే వకీల్ సాబ్ షూటింగ్ ను రీస్టార్ట్ చేయడమే మంచిదనుకుంటున్నాడట పవన్. ఈ నెల 23 నుంచి వకీల్ సాబ్ షూటింగ్ రీస్టార్ట్ కాబోతోందని సమాచారం. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ని డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నాడట. వచ్చే సంక్రాంతి సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడట పవన్. అయితే ఇప్పటి వరకు వకీల్ సాబ్ లో హీరోయిన్ ఎవరనేది ప్రకటించలేదు నిర్మాతలు. మరి ఇప్పటికైనా హీరోయిన్ పేరు ప్రకటిస్తారా అనేది చూడాలి.

పవన్ కళ్యాణ్ వెండితెరపై కనిపించి చాలా నెలలైపోయింది. రాజకీయాల్లోకి వచ్చి సినిమాలకు పుల్ స్టాప్ పెట్టిన పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడంతో అభిమానుల్లో ఎక్కడలేని ఉత్సాహం నెలకొంది. ఓ వైపు రాజకీయాల్లో ఉంటూనే కెమెరా ముందుకు వచ్చేశాడు పవర్ స్టార్. ఇప్పటికే వకీల్ సాబ్ షూటింగ్ కొంత వరకు పూర్తి కూడా అయింది. అయితే ఆయన ఎన్నికల్లో పోటీ చేసినా.. సరైన ఆదరణ దక్కలేదు. అభిమానుల సపోర్ట్ ఉన్నా.. అది ఆశించిన స్థాయిలో కలిసిరాలేదు. అందుకే ఓ వైపు రాజకీయాల్లో ఉంటూనే.. మరోవైపు వెండితెరపై మెరిసేందుకు సిద్ధమైపోయాడు. ప్రజాసమస్యలపై పోరాటం ఓవైపు.. నటన మరోవైపు బ్యాలెన్స్ గా నడిపించేందుకు ప్రణాళికలు రచించాడు.

కరోనా దెబ్బకు లాక్ డౌన్ విధించడంతో.. సినిమా షూటింగ్ లకు బ్రేక్ పడింది. కరోనా ఎపుడు తగ్గుతుందా.. ఎపుడు షూటింగ్ కు వెళదామా అని పవర్ స్టార్ వెయిట్ చేశాడు. లాక్ డౌన్ ఎత్తివేసినా.. కరోనా మాత్రం తగ్గలేదు. ఇంకేం చేసేది లేదంటూ మళ్లీ కెమెరా ముందుకు వచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.