If he loses election Trump muses Maybe I will have to leave the country

అమెరికా ఎదుర్కొంటున్న కోవిడ్-19 సంక్షోభం , అస్థిరత ఆర్థిక వ్యవస్థ మరియు జాతి అన్యాయంపై అశాంతి వంటి ముఖ్యమైన సమస్యల మధ్య అధ్యక్షులు ట్రంప్ ఎన్నికల ప్రచారంపై దృష్టి సారింసారించటమే కాక అభ్యర్థిగా తన వైఫల్యాలలో కొన్నింటిని క్రియాశీల ఎంపికలుగా పునరావృతం చేస్తున్న సంగతి తెలిసిందే అయితే శుక్రవారం 16 అక్టోబర్ సాయంత్రం మేకన్ ర్యాలీలో పాల్గొన్న అధ్యక్షులు ట్రంప్ రెండు గంటల పాటు ప్రసంగించారు కరోనావైరస్, వాణిజ్యం మరియు అమెరికన్ ఆర్థిక వ్యవస్థ గురించి అరుదుగా ప్రస్తావించారు.

సబర్బన్ మహిళలు గురించి ప్రస్తావిస్తూ“వారు నా విధానాన్ని ఇష్టపడుతున్నారని నేను విన్నాను కాని వారు నా వ్యక్తిత్వాన్ని ఇష్టపడరు. వారు సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాను” అని వివరించారు.అయితే ఆయన చేసిన చాలా వ్యాఖ్యలు వార్తా మాధ్యమాలు, టెక్నాలజీ కంపెనీలు అధ్యక్షులు ట్రంప్ కి వ్యతిరేకంగా ఉన్నాయి అని ఆయన కు కోవిడ్-19 వైరస్ నిర్ధారణ అయినపుడు ఆయన ప్రత్యర్థులు సంతోషించడం అయన గమనించారు అని చెప్తూ ఆయన వ్యక్తిగత మనోవేదన కు గురి అయ్యారు. ఒకానొక సమయంలో"నేను ఎన్నికల్లో ఓడిపోతాను అని మీరు ఊహించగలరా? నేను ఆ అనుభూతిని ఊహించుకుంటే బహుశా నేను దేశం విడిచి వెళిపోతాను ఏమో నాకు తెలియదు. ” అని అధ్యక్షులు ట్రంప్ మనోవేదన కు గురి అయ్యారు.ఎన్నికల్లో ఓడిపోతే దేశం విడిచి వెళ్తానని అధ్యక్షులు ట్రంప్ చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.