Remdesivir Fails to Prevent Covid 19 Deaths in Huge Trial

కరోనా వైరస్‍ చికిత్సలో ఇటీవల కాలంలో అత్యధికంగా వినియోగిస్తున్న ఔషధం రెమ్‍డెసివిర్‍. కరోనా లక్షణాలు మధ్యస్థంగా ఉన్నవారిలో ఆ లక్షణాలు మరింత తీవ్రం కాకుండా వైద్యులు యాంటీ వైరల్‍ డ్రగ్‍ రెమ్‍ డెసివిర్‍ వాడుతున్నారు. కరోనా చికిత్సలో ఇదే ప్రాణాధారమైన మందు అని ప్రచారం జరగడంతో రూ.5,400కి లభ్యమయ్యే ఇంజక్షన్‍ వైల్‍ కాస్తా, బ్లాకులో రూ.30 వేల వరకు ధర పలికిన సందర్భాలున్నాయి. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍కు కరోనా సోకిన సమయంలోనూ ఈ ఔషధాన్ని వినియోగించారు. అయితే, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‍ఓ) రెమ్‍ డెసివిర్‍ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. కరోనా చికిత్సలో ముఖ్య ఔషధంగా ఉపయోగిస్తున్న రెమ్‍ డెసివిర్‍తో తో అనుకున్న మేర ప్రయోజనాలేవీ కనిపించడం లేదని సృష్టం చేసింది. కరోనా రోగులు కోలుకోవడం, వారిని ప్రాణాపాయం నుంచి బటయపడేయడం వంటి అంశాలపై రెమ్‍ డెసివిర్‍ ఏమాత్రం ప్రభావం చూపడం లేదని వివరించింది.

దీనిపై డబ్ల్యూహెచ్‍ఓ ఓ అధ్యయనం చేపట్టింది. 30 దేశాల్లోని 11,266 మంది రోగులకు అందించిన 28 రోజుల చికిత్సను పరిశీలించింది. రెమ్‍ డెసివిర్‍ ను హైడ్రాక్సీ క్లోరోక్విన్‍, లోపినావిర్‍, రిటోనావిర్‍, ఇంటర్ఫెరోన్‍ వంటి ఔషధాలతో కలిపి ఇచ్చినప్పుడు అసలేమీ లేకుండానూ ఉన్నట్టు గుర్తించారు. కాగా, రెమ్‍డెసివిర్‍ కరోనా చికిత్సలో ప్రాణాధార ఔషధం అని ఇప్పటికే భావిస్తున్న తరుణంలో డబ్ల్యూహెచ్‍ఓ అధ్యయనం తెరపైకి వచ్చింది.