Biden vows to repeal 'Muslim ban' imposed by Trump admin if elected

తాను అధికారంలోకి వస్తే ముస్లింలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తానని డెమోక్రటిక్‍ అభ్యర్థి జో బైడెన్‍ ప్రకటించారు. కీలకమైన సామాజిక రాజకీయ అంశాల్లో ముస్లిం అమెరికన్లను భాగస్వాములను చేస్తానని పేర్కొన్నారు. అమెరికాలో పెరిగిపోతున్న ద్వేషపూరిత నేరాలను అరికట్టే చట్టాలను తీసుకొచ్చేందుకు ఒత్తిడి తెస్తానన్నారు. ట్రంప్‍ హయాంలో తీసుకొచ్చిన ఆరాచక విధానాలకు స్వస్తి పలుకుతానని చెప్పారు. విద్య, వైద్య రంగాల్లో అసమానతలు తొలగిస్తానన్నారు.