telangana-jagruti-batukamma-songs-cd-and-books-released

తెలంగాణ జాగృతి బతుకమ్మ పాటల సీడీని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచన మేరకు ఆవిష్కరించారు. 8 సంప్రదాయ బతుకమ్మ చప్పట్ల పాటలు ఇందులో ఉన్నాయి. కవి, రచయిత కోదారి శ్రీను ఈ పాటలు సేకరించగా, తేలువిజయ, పద్మావతి, వరం తదితరులు పాటలు పాడారు. ఆవిష్కరణ కార్యక్రమంలో జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్‍ ఆచారి, ఉపాధ్యక్షులు మేడే రాజీవ్‍ సాగర్‍, వరలక్ష్మి, కోదారి శ్రీను తదితరులు పాల్గొన్నారు.