Andhra Pradesh CM launches Jagananna Vidya Kanuka

ఆంధప్రదేశ్‍ రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి ఉన్నత విద్య వరకు చదువుకోవాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని, పిల్లల పోషణ, సంరక్షణ, చదువులపై ధ్యాస పెట్టిన ప్రభుత్వం గతంలో ఎప్పుడూ లేదని, ఇది మీ మేనమామ ప్రభుత్వమని గర్వంగా చెబుతున్నానని ముఖ్యమంత్రి వైయస్‍ జగన్‍మోహన్‍ రెడ్డి పేర్కొన్నారు. క•ష్ణా జిల్లా పునాదిపాడు జిల్లా పరిషత్‍ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమాన్ని సీఎం వైయస్‍ జగన్‍ ఇటీవల ప్రారంభించారు.

ప్రతి విద్యార్థి  ఉన్నత విద్య వరకు చదువుకోవాలన్న ఉద్దేశంతో జగనన్న విద్యా కానుక పథకానికి శ్రీకారం చుట్టామని, రాష్ట్రంలో 44.32 లక్షల మంది  విద్యార్థులకు విద్యా కానుక కిట్లు రూ.650 కోట్ల ఖర్చుతో అందజేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. చదువు అన్నది ఒక ఆయుధం లాంటిదని, ప్రపంచాన్ని మార్చే శక్తి ఒక్క చదువుకే ఉందన్నారు. ప్రపంచాన్ని జయించే పరిస్థితి మన పేద పిల్లలకు రావాలి. ఇది జరగాలంటే విద్యా రంగంలో సమూలమైన మార్పులు రావాలి. ఇందుకోసమే చదువుకు ప్రాధాన్యత ఇస్తున్నాం.   స్వాతంత్య్రం వచ్చి 73 సంవత్సరాలు అయినా కూడా చదువు రాని వారు మన మధ్య ఉన్నారు. అందుకే ఈ రోజు ఆ దిశగా  అడుగులు వేస్తూ పరిస్థితి మార్చే ఆలోచన చేస్తున్నాం. ఇంగ్లీష్‍చదువులు చదవాలంటే ఖరీదైంది. ఈ పరిస్థితులు మారినప్పుడే పిల్లలను చదవించే కార్యక్రమం ముందుకు సాగుతుంది. అంగన్‍ వాడీ నుంచి మొదలుపెడితే..ఉన్నత విద్య వరకు తమ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందని, మన బడి నాడు-నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చామని చెప్పారు. కరెంట్‍, ట్యూబ్‍లైట్లు, మంచినీళ్లు ఉన్న స్కూళ్లు, గ్రీన్‍బోర్డులు, పిల్లలు, టీచర్లు కూర్చునేందుకు మంచి పర్నీచర్‍, బల్లలు మరమ్మతులు చేయించాం.

మంచి పెయింటింగ్‍లతో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేశామని, తినడానికి గోరుముద్దు వంటి పథకాన్ని ప్రారంభించాం. మంచి కిచెన్‍ ఏర్పాటు చేశాం. ప్రతి పేదవాడికి ఇంగ్లీష్‍ మీడియం చదువులు తీసుకువచ్చేందుకు శ్రీకారం చుడుతూ అడుగులు ముందుకు వేశాం. ఇందులో భాగంగా విద్యా కానుకకు శ్రీకారం చుడుతున్నాం. ఈ రోజు పెద్ద స్కూళ్లకు వెళ్లే పిల్లల మాదిరిగానే పేద పిల్లలకు కూడా మంచి యూనిఫాం, మంచి స్కూల్‍ బ్యాగ్‍, షూష్‍, స్కాక్స్లు, పుస్తకాలు, నోట్‍ పుస్తకాలు అందజేస్తున్నాం. జగనన్న విద్యా కనుక అందజేస్తున్నామని జగన్‍ తెలిపారు.

1 నుంచి 10వ తరగతి వరకు చదివే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అందజేస్తున్నాం. నవంబర్‍ 2న బడులు తెరవాలనుకుంటున్నాం. బడులు తెరవకముందే ఈ కిట్లు అందజేస్తున్నాం. 42,34 లక్షల మంది పిల్లలకు దాదాపుగా రూ.650 కోట్లతో విద్యా కానుక అందజేస్తున్నాం. కుట్టు కూలీకి అవసరమైన డబ్బులతో పాటు మూడు జతల యూనిఫాం, పుస్తకాలు, బెల్ట్, షూస్‍, సాక్స్లు, బ్యాగ్‍ అందజేస్తున్నాం. కోవిడ్‍ కారణంగా సూచనలు పాటిస్తూ మూడు రోజుల పాటు మూడు దఫాలుగా విద్యార్థులకు కిట్లు అందజేస్తున్నాం. బడి పిల్లలంతా కూడా గర్వ పడేలా ఈ కిట్లు అందజేస్తున్నాం. జగన్‍ మామ ముఖ్యమంత్రి అయ్యాక మా బడులు మారుతున్నాయి. గొప్పగా చదువుకుంటున్నామని చెప్పుకునే రోజులు వచ్చాయని నేను గర్వంగా చెప్పగలను. ఉన్నత విద్య వరకు ప్రతి ఒక్కరూ చదవాలి. మన పిల్లలు ఉన్నత విద్యలు చదవాలి. ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రపంచమంతా రావాలి. ప్రతి పిల్లాడు గొప్పగా ఇంగ్లీష్‍ చదువులు చదవగలిగితేనే మనం, మన తలరాతలు కూడా మారుతాయి. అందుకు అవరోధాలు ఎంటో తెలుసు కాబట్టి..విద్యారంగంలో దాదాపుగా 8 ప్రధాన పథకాలు అమలు చేస్తున్నామని జగన్‍ వివరించారు.