Donald Trump moves to tighten visa access for high skilled

గత అధ్యక్ష ఎన్నికల సమయంలో అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ ఇమ్మిగ్రేషన్‍ వీసాలపై ఆంక్షలు విధించి అమెరికన్లకే ఉద్యోగాలు తొలుత ఇచ్చేలా తమ ప్రభుత్వం వ్యవహరిస్తుందని పేర్కొంటూ ఎంతోమంది అమెరికన్‍లను ఆకట్టుకుని విజయాన్ని సాధించారు. ఇప్పుడు ఎన్నికలకు కొద్దిరోజుల ముందు తన ఆయుధమైన ఇమ్మిగ్రేషన్‍ను మరోసారి ప్రయోగించాడు. వీసాలపై ఆంక్షలు, మార్పులు వంటి వాటితో అమెరికన్లకు చేరువయ్యేందుకు వ్యూహరచన చేశారు.  ‘అమెరికన్ల ప్రయోజనాలు కాపాడే’ నెపంతో హెచ్‍1బీ వీసాపై పెద్ద బాంబు వేశారు. దీంతో వేలాది మంది భారతీయ సాంకేతిక నిపుణులకు, ఇతర ముఖ్యరంగాల్లోని ఉద్యోగార్థులకు ఇది పెద్ద షాక్‍ అని చెప్పవచ్చు. నాన్‍-ఇమిగ్రెంట్‍ వీసా పథకం హెచ్‍1బీలో కఠిన ఆంక్షలు చేరుస్తూ కొత్త నిబంధనలను ప్రకటించారు. అమెరికా అంతర్గత భద్రతాసేవల విభాగం(డీహెచ్‍ఎస) 2 విధాలైన నిబంధనలు (ఐఎఫఆర్‍) ప్రకటించింది. వేతనాల భారీ పెంపునకు సంబంధించినది ఒకటైటే.. అర్హతల నిబంధనలకు కొత్త నిర్వచనాలు చేర్చి కఠినతరం చేయడం రెండోది. ఇంతవరకూ ఉన్న ‘స్పెషాలిటీ ఆక్యుపేషన్‍’, ‘యజమాని-ఉద్యోగి సంబంధాలు’ మొదలైన వాటి నిర్వచనం మారిపోయి వాటి పరిధి తగ్గుతుంది.


‘థర్డ్ పార్టీ వర్క్సైట్‍’ అనే నిబంధనను కొత్తగా చేర్చారు. వీటన్నింటి వల్ల హెచ్‍1బీ కింద ఉన్న ‘ప్రత్యేక నైపుణ్యాల’ కేటగిరీ కుచించుకుపోయి వీసాల సంఖ్యలో భారీ కోత పడనుంది. అమెరికా పౌరసత్వ-వలస సేవల విభాగం (యూఎససీఐఎస్‍) లెక్కల ప్రకారం.. ఈ ఏడాది ఏప్రిల్‍ 1 వరకూ ఉన్న గణాంక వివరాలు పరిశీలిస్తే ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి 2.5 లక్షల మంది సాంకేతిక నిపుణులు హెచ్‍1బీ కోసం దరఖాస్తు చేశారు. ఇందులో 1.84 లక్షల మంది భారత్‍కు చెందినవారే. మొత్తం దరఖాస్తుల్లో ఇది 67శాతం. కొన్నేళ్లుగా వర్క్ పర్మిట్లలో భారత్‍ వాటా తగ్గుతున్నప్పటికీ 70 శాతానికి పైగా వీసాలు భారతీయులకే మంజూరవుతున్నాయి.
ఈసారి ఈ సంఖ్య భారీగా తగ్గుతుందని టెక్‍ కంపెనీలు భావిస్తున్నాయి. ఎన్నికల్లో ఓట్ల వేటకోసమే ట్రంప్‍ ఈ నిబంధనలను ఇపుడు హడావిడిగా ప్రకటించారని విశ్లేషకులు అంటున్నారు. ట్రంప్‍ది జాతీయవాద ఎజెండా. ‘అమెరికా ఫస్ట్’ నినాదంతో 2016లో ఆయన అందలమెక్కారు. ఉద్యోగాల్లో తొలి ప్రాధాన్యం అమెరికన్లకే ఉండాలన్నది ఆయన లక్ష్యం. తద్వారా మెజారిటీ ఓటు బ్యాంకును కొల్లగొట్టాలనుకుంటున్నారు.
శ్వేతజాతీయుల్లో మరోసారి ఆదరణను పెంపొందించుకునేందుకు ఆయన తాజా నిబంధనలను తెచ్చారని అంటున్నారు. అదీకాక గత ఎన్నికల్లో ఆయనకు భారతీయ ఓటర్ల నుంచి పెద్దగా మద్దతు లభించేలదని ఓ వార్త. అప్పుడు ప్రత్యర్థిగా ఉన్న హిల్లరీకి భారతీయులు ఎక్కువమంది మద్దతుగా నిలిచారు. ఈ నేపథ్యంలో ట్రంప్‍ మరోసారి అమెరికన్‍లకు ప్రయోజనం కలిగేలా ఇమ్మిగ్రేషన్‍ విధానాల్లో మార్పులను ప్రకటించారు. దాని ద్వారా శ్వేత జాతీయులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

కాగా ఇప్పటికే కొవిడ్‍ దెబ్బకు వేల మంది టెకీలు ఉద్యోగాలు కోల్పోయి అమెరికా నుంచి భారత్‍కు తిరిగి వచ్చారు. మళ్లీ వెళ్లడానికి కూడా అనేక ఆంక్షలు అడ్డంకిగా మారుతున్నాయి. తాజా నిబంధనలు వారికి కష్టాలనే కలిగించనున్నాయి. హెచ్‍-1బీ వీసా కింద హైర్‍ చేసుకునే సాంకేతిక నిపుణులను కంపెనీలు థర్డ్ పార్టీ క్లయంట్‍ సైట్‍ దగ్గరే పనికి వినియోగిస్తాయి. ఇన్నాళ్లూ ఆ వర్క్సైట్‍ వద్ద ఉద్యోగులు మూడేళ్లపాటు పనిచేసేందుకు, అవసరమైతే మరో ఏడాది పొడిగించేందుకు అనుమతి ఉండేది. ఇపుడా పరిమితిని ఏడాదికి తగ్గించారు. ఇది కంపెనీలకు, టెకీలకు దెబ్బ అంటున్నారు. 


ప్రత్యేక నైపుణ్యాల కేటగిరీ నిర్వచనం మార్చేశారు. ఈ కేటగిరీ కింద హైర్‍ చేసుకునే టెకీల విషయమై కంపెనీలు.. ఈ నైపుణ్యమున్న వ్యక్తులు అమెరికాలో లభ్యం కావడం లేదనీ, అందుకే విదేశాల నుంచీ తీసుకుంటున్నామని ఇమిగ్రేషన్‍ అధికారులకు వివరణ ఇవ్వాలి. నిజానిజాలను అధికారులు అధ్యయనం చేసి నిజమని తెలిస్తేనే వీసా ఇస్తారు.


తమ కోటా హెచ్‍1బీ వీసాలను పూర్తిగా పొందేందుకు కంపెనీలు మోసాలకు పాల్పడుతున్నాయి. కొందరు నకిలీ అభ్యర్థులను చేర్చుకున్నట్టు, వారికి జీతాలిస్తున్న ట్లు రికార్డుల్లో చూపుతున్నాయి. ఇమిగ్రేషన్‍ అధికారులు చెబుతున్న దాని ప్రకారం.. కంపెనీలు ఎంప్లాయ్‍మెంట్‍ పక్రియను ఓ పేపర్‍పై చూపి పన్నులు ఎగ్గొడుతున్నా యి. అమెరికన్లకు ఉద్యోగాలు రాకుండా చేస్తున్నాయి. ఇకపై అలా కుదరదు. థర్డ్ పార్టీ వర్క్సైట్‍లో నియమిస్తున్నామని కంపెనీలు ధ్రువీకరణ పత్రాలివ్వాలి. ఇమిగ్రేషన్‍ అధికారులు ఆ సైట్లకు వెళ్లి తనిఖీలు చేపట్టడానికి వీలుగా నిబంధనలు చేర్చారు. ఈ ఇన్‍స్పెక్షన్‍ను వీసా జారీకి ముందు, జారీ సమయంలోను, జారీ చేశాక ఎప్పుడైనా చేపట్టొచ్చు. ప్రతీ ఏటా అమెరికా 85,000 దాకా హెచ్‍1బీ వీసాలు మంజూరు చేస్తోంది. ఇందులో 65,000 వీసాలు ‘ప్రత్యేక నైపుణ్యాల’ కేటగిరీ కింద ఇస్తున్నారు. మిగిలిన 20,000 వీసాలను అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించి, అక్కడే డిగ్రీ, మాస్టర్స్ చేసేవారికి కేటాయిస్తున్నారు. తాజా నిబంధనల వల్ల, ముఖ్యంగా నిర్వచనాల మార్పు వల్ల 65,000 వీసాల సంఖ్యలో భారీ కోత పడనుంది. 

వేతనాల పెంపు నిబంధనల వల్ల కూడా కంపెనీలు ఇకపై పెద్ద సంఖ్యలో హైర్‍ చేసుకోకపోవచ్చు. భారతీయ టెకీలు తక్కువ జీతాలకు వస్తుండడం వల్ల అదే పని చేసే అమెరికన్లకూ అంతే జీతాన్ని ఇన్నాళ్లూ కంపెనీలు ఇస్తున్నాయి. ట్రంప్‍ ప్రభుత్వం దీన్ని గమనించి కంపెనీలు ఫలానా నైపుణ్యమున్న వారికి ఇచ్చే జీతాల మొత్తాన్ని పెంచాలని ఆదేశాలు ఇవ్వనుంది. భారత్‍ లాంటి దేశాల నుంచి తీసుకునే వారికి కూడా ఈ పెద్ద జీతాలు, ఇతర పెర్కస్ ఇవ్వడానికి కంపెనీలు అంగీకరించకపోవచ్చు. ఏవైనా నకిలీ పత్రాలు స•ష్టించడానికి ప్రయత్నించినా ఇమిగ్రేషన్‍ అధికారులు వాటిని పట్టుకుంటారు. కాబట్టి అలాంటి చర్యలకు దిగకపోవచ్చు.
సాధారణంగా ఏదైనా కీలక విధాన నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని ముందు పబ్లిక్‍ డొమైన్‍లో పెట్టి ప్రజాభిప్రాయానికి, ఇతరత్రా కామెంట్స్కు అవకాశం కల్పిస్తారు. ట్రంప్‍ ప్రభుత్వం మాత్రం ఈ వీసా నిబంధనల్లో మార్పులకు ఆ అవకాశం ఇవ్వలేదు. కొవిడ్‍ వల్ల అమెరికన్లకు ఎదురైన ఆర్థిక ఇబ్బందులు కొనసాగకుండా, వారికి ఉద్యోగాలు, మంచి వేతనాలు లభించేట్లు చేసేందుకే ఈ నోటీస్‍ పీరియడ్‍ను ఎత్తేసినట్లు డీహెచ్‍ఎస తెలిపింది. ఈ కొత్త నిబంధనలను వెంటనే ఫెడరల్‍ రిజిస్ట్రీలో పెట్టింది. ఇది 60 రోజుల తరువాత అమల్లోకి వస్తుంది. 


వీసాల సంఖ్యలో కోత ఉండదు: వైట్హౌస్

అత్యంత  నైపుణ్యం ఉన్న నిపుణులకే ప్రాధాన్యతను ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో అమెరికన్ల ఉద్యోగాలు, వారి జీతాల, జీవితాల పరిరక్షణకే అధ్యక్షుడు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపింది. విదేశీ నిపుణుల వల్ల అమెరికన్ల అవకాశాలు దెబ్బతినకూడదన్నది ట్రంప్‍ లక్ష్యం. ‘‘అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే ప్రత్యేక నైపుణ్యాలున్న వారికే అనుమతి. ఇన్నేళ్లూ ఈ హెచ్‍1బీ వీసా పథకాన్ని తీవ్రంగా దుర్వినియోగం చేశారు. ఓ అనవసర వ•థా పథకంగా మార్చారు. విదేశాల నుంచి తక్కువ జీతాలకు సిబ్బందిని తెచ్చి అమెరికన్ల ప్రయోజనాలకు దెబ్బకొట్టారు.

తాజా సంస్కరణల ద్వారా ప్రతీ ఏటా జారీచేస్తున్న వీసాల పరిమితిలో ఏ మార్పూ ఉండబోదు. వీటి ద్వారా లోపాలు సవరిస్తున్నాం. సత్తా, నైపుణ్యం ఉన్న సిబ్బందిని కంపెనీలు హైర్‍ చేసుకుని ప్రపంచ మార్కెట్‍లో పోటీకి తట్టుకునేట్లు చేయడమే సంస్కరణల ముఖ్యోద్దేశం’’ అని ట్రంప్‍ పేరిట విడుదల చేసిన ప్రకటనలో వైట్‍హౌస్‍ వివరించింది. ‘‘ఆంతరంగిక భద్రతలో ఆర్థిక భద్రత ఓ భాగం. అమెరికన్‍ ఉద్యోగికి తొలి ప్రాథాన్యం ఇచ్చేలా చట్టం తేవడం ఉద్దేశం’’ అని డీహెచ్‍ఎస తాత్కాలిక ఛీఫ్‍ చాడ్‍ వోల్ఫ్ పేర్కొన్నారు.

అమెరికా ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బ - నాస్కామ్

వీసా నిబంధనలను కఠినతరం చేయడం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బ అని నాస్కామ్‍ అభిప్రాయపడింది. ‘ఇవి అమెరికన్ల ప్రయోనాలనూ దెబ్బతీస్తాయి. వారికి ఉద్యోగాలు లేకుండా చేస్తాయి. కొవిడ్‍ నుంచి తేరుకుంటున్న వేళ అమెరికాకు కావాల్సినది నిజమైన నైపుణ్యం. ఆ నైపుణ్యం పూర్తిస్థాయిలో కంపెనీలు చేపట్టనీయకుండా ఈ కొత్త నిబంధనలు నియంత్రిస్తాయి. కొవిడ్‍పై పరిశోధన-అభివ•ద్ధి (ఆర్‍ అండ్‍ డీ)కి ఇవి ఆటంకం. ముఖ్యంగా స్టెమ్‍ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్‍, మేథమేటిక్స్) రంగాల్లో నైపుణ్య సిబ్బంది లభించడానికి ఇవి అడ్డుపడతాయి’ అని నాస్కామ్‍ విమర్శించింది.
ఏదీ ఏమైనా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి ఇమ్మిగ్రేషన్‍ సంస్కరణలు ట్రంప్‍కు లాభిస్తాయా లేదా అన్నది వేచి చూడాల్సిందే.