Facebook CEO Mark Zuckerberg donates $100 million to help US election offices

కోవిడ్ -19 మహమ్మారికి సంబంధించిన సవాళ్లను ఉదాహరణకి ఓటింగ్ కు సంబంధించిన పోల్ కార్మికుల పరికరాలు, పోల్ కార్మికులకు కోవిడ్ -19 రక్షణ పరికరాలు లాంటివి సమకూర్చడానికి అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ఎదుర్కొనే ఇబ్బందులని ఎదుర్కోవటానికి మార్క్ దంపతులు గతంలో 300 మిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఫేస్‌బుక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మిస్టర్ మార్క్ జుకర్‌బర్గ్ మరియు అతని భార్య ప్రిస్సిల్లా చాన్ ఎన్నికల అధికారులకు మద్దతు ఇవ్వడానికి నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన మౌలిక సదుపాయాల కోసం అదనంగా 100 మిలియన్ డాలర్లు విరాళంగా ఇస్తామని మిస్టర్ మార్క్ తన ఫేస్ బుక్ పోస్ట్ ద్వారా తెలిపారు.

అమెరికన్ ప్రజలు సురక్షితంగా ఓటు వేయడానికి ప్రతి అధికార పోలింగ్ కేంద్రాలు ఈ నిధుల్ని ఉపయోగించుకోవచ్చు అని మరియు సురక్షిత ఓటింగ్ కోసం అవసరం అయ్యే మౌలిక సదుపాయాల నిధులు కోసం ఎన్నికల అధికారుల నుండి మేము ఊహించిన దానికంటే చాలా ఎక్కువ స్పందన వచ్చింది అని మిస్టర్ మార్క్ తన ఫేస్‌బుక్ పోస్ట్ లో పేర్కొన్నారు. అంతే కాక ఇప్పటివరకు 2,100 కి పైగా స్థానిక ఎన్నికల అధికార పోలింగ్ కేంద్రాలు మౌలిక సదుపాయాల మద్దతు కోసం చికాగో ఆధారిత లాభాపేక్షలేని సంస్థ సిటిసిఎల్‌కు దరఖాస్తులు సమర్పించాయి అని మిస్టర్ మార్క్ తెలిపారు.

పోస్ట్‌లో మిస్టర్ మార్క్ నిధుల వినియోగాన్ని నిరోధించడానికి ప్రయత్నిస్తున్న వ్యాజ్యాలపై కూడా స్పందిస్తూ “మా ప్రారంభ విరాళం నుండి విరాళాలు స్వీకరించే సంస్థలకు పక్షపాత ఎజెండా ఉందని వాదనల ఆధారంగా ఈ నిధులను ఉపయోగించకుండా నిరోధించే ప్రయత్నంలో బహుళ వ్యాజ్యాలు దాఖలు చేయబడ్డాయి. అది అబద్ధం” అని తెలిపారు.