KTR visits flood affected areas in Hyderabad

హైదరాబాద్‍ నగరంలో వరద తీవ్రతకు ఇబ్బందులు పడుతున్న ప్రజలకి రేషన్‍ కిట్‍లతో పాటు ఇతర అన్ని సౌకర్యాలు అందించేందుకు జీహెచ్‍ఎంసీ ప్రయత్నిస్తోందని తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‍ తెలిపారు. మూడోరోజు వరద ప్రభావిత కాలనీల్లో ఆయన పర్యటించారు. ఖైరతాబాద్‍లోని బీఎస్‍ మక్తా కాలనీలో జీహెచ్‍ఎంసీ ఏర్పాటు చేసిన షెల్టర్‍ హోమ్‍ను పరిశీలించి అక్కడ అందిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. బేగంపేటలోని మయూరిమార్గ్, ప్రకాశ్‍నగర్‍, బ్రాహ్మణవాడి ప్రాంతాల్లో కేటీఆర్‍ పర్యటించి స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలంతా తాగునీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వరద ప్రభావిత కాలనీల్లో ప్రత్యేకంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడతామని మంత్రి తెలిపారు. ప్రజలకు అవసరమైన వైద్య సదుపాయాన్ని అందిస్తామని, షెల్టర్‍ హోమ్‍లో ఉన్న వారందరికీ ఇప్పటికే ఆహారంతో పాటు దుప్పట్లు, మందులు అందజేస్తున్నట్లు కేటీఆర్‍ తెలిపారు.