Schools to reopen on November 2 in Andhra Pradesh

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో నవంబర్ 2వ తేదీ నుంచి స్కూల్స్ ప్రారంభిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే నాలుగైదు నెలలుగా స్కూల్స్ ప్రారంభించ లేకపోయామని చెప్పారు. ఇంటర్లో 30 శాతం సిలబస్ తగ్గించామని, అదే పద్ధతిలో హైస్కూల్ విద్యార్థులకు కూడా సిలబస్ కుదిస్తామని తెలిపారు. స్కూల్స్ ప్రారంభమయ్యేలోపు విద్యా క్యాలెండర్ విడుదల చేస్తామని మంత్రి సృష్టం చేశారు.