Srivari Navaratri Brahmotsavam Celebrations

తిరుమల శ్రీవారి నవరాత్రి  బ్రహ్మోత్సవాలు శుక్రవారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా తిరుచ్చి సేవను ఘనంగా నిర్వహించారు. బంగారు తిరుచ్చిపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారిని రంగనాయకుల మండపంలో వేంచేపు చేశారు. అక్కడ అర్చకులు, ఈవో జవహర్‍ రెడ్డి కంకణధారణ చేశారు. అనంతరం ఆస్థానం నిర్వహించారు. యాగశాలలో ఉత్సవాలకు సంబంధించిన వైదిక కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.