Chief Minister KCR conveys Bathukamma greetings

తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‍ రావు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా, తెలంగాణ సాంస్కృతిక వైభవానికి చిహ్నంగా నిలుస్తున్న బతుకమ్మ పండుగను ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‍ పిలుపునిచ్చారు. పంటలు బాగా పండి వ్యవసాయం గొప్పగా వర్థిల్లాలని, ప్రతీ ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరిసేలా దీవించాలని అమ్మవారిని ముఖ్యమంత్రి ప్రార్థించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రజలు పండుగ జరుపుకోవాలని కోరారు.