4038 fresh positive cases of COVID 19 in Andhra Pradesh

ఆంధప్రదేశ్‍ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 73,767 మందికి పరీక్షలు నిర్వహించగా 4,038 మందికి పాజిటివ్‍గా తేలినట్లు వైద్యారోగ్యశాఖ బులెటిన్‍లో పేర్కొంది. ఇప్పటి వరకూ 68,46,040 పరీక్షలు  చేయగా, పాజిటివ్‍ కేసుల సంఖ్య 7,71,503కి చేరింది. ఒక్క రోజులో 5,622 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ కావడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 7,25,009కి చేరింది. తాజాగా 38 మంది మృతితో మొత్తం మరణాలు 6,357కి చేరాయి. రాష్ట్రంలో యాక్టివ్‍ కేసులు 40,047 ఉన్నాయి.