Sabarimala temple to open for monthly five day pooja

ఆరు నెలల తర్వాత శబరిమల అయ్యప్ప ఆలయంలోకి భక్తులను అనుమతించనున్నారు. కొవిడ్‍ కారణంగా మార్చి 24 నుంచి భక్తులకు దర్శనాలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే, నెలలో ఐదు రోజులు పూజలు నిర్వహించాలని ట్రానెవోకోర్‍ దేవస్థానం బోర్డు నిర్ణయించింది. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఆలయాన్ని తెరవనున్నారు. భక్తులను మాత్రం శనివారం (17వ తేదీ) ఉదయం 5 గంటల నుంచి దర్శనానికి అనుమతిస్తారు.