Telangana reports 1432 new Covid 19 cases 8 deaths

తెలంగాణ రాష్ట్రంలో తాజాగా 38,895 మందికి పరీక్షలు చేయగా 1,432 మందికి పాజిటివ్‍గా తేలినట్లు వైద్యారోగ్యశాఖ బులెటిన్‍లో పేర్కొంది. ఇప్పటి వరకు 37,03,047 పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్‍ కేసుల సంఖ్య 2,17,670 కి చేరింది. ఒక్క రోజులో 1,949 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అవడంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 1,93,218కి చేరింది. తాజాగా 8 మంది మృతితో మొత్తం మరణాలు 1,249కి చేరాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 23,203 యాక్టివ్‍ కేసులున్నాయి.