
ప్యాన్ ఇండియా డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి.. వరుస సూపర్‌హిట్, బ్లాక్‌బస్టర్స్ , ఇండస్ట్రీహిట్స్ మూవీస్‌తో ఇండియన్ టాప్ డైరెక్టర్‌గా ఎదిగారు. ‘బాహుబలి’తో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి ఆల్ ఇండియా డైరెక్టర్ అయ్యారు. ఇప్పుడు ఈయన దర్శకత్వంలో రూపొందుతోన్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ ‘ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం). గోండు వీరుడు కొమురం భీమ్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్, మన్యంవీరుడు అూ్లరి సీతారామరాజుగా మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ నటిస్తోన్న ఈ ఫిక్షనల్ పీరియాడికల్ డ్రామాను డి.వి.వి.ఎంటర్టైన్మెంట్ను డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్, అలియా భట్, హాలీవుడ్ స్టార్స్ నటిస్తున్నారు.
కోవిడ్ ప్రభావం తర్వాత కేంద్ర ప్రభుత్వం విధించిన విధివిధానాతో షూటింగ్‌ను అక్టోబర్ 5న పునఃప్రారంభించారు. ఈ రోజు అక్టోబర్ 10న రాజమౌళి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన ఇంటర్వ్యూ...
కరోనా వారియర్ అయ్యారు. ఆరోగ్యం ఇప్పుడెలా ఉందండి...?
- బావుందండి.. అంతా సెట్ అయిపోయింది.
లాక్డౌన్ తర్వాత బయటకు టూర్ వెళ్లినట్లురుగా..?
- చాలా రోజు ఇంట్లోనే ఉన్నాం కదా, కాబట్టి నేను, రమ సరదాగా బయటకు వెళదామని అనుకున్నాం. బందీపూర్‌లోని రిసార్ట్‌కు వెళ్లాం. పుట్టిన రాష్ట్రంలోకి వెళ్లడం ఓ మంచి ఫీలింగ్ ఇచ్చింది.
కరోనా వారియర్ అయిన ప్లాస్మా డొనేషన్‌కు మీకు అవకాశం రాలేదుగా?
- మన శరీరంలో కరోనా వచ్చిన రేంజ్‌ను బట్టి యాంటీ బాడీస్ డెవలప్ అవుతాయి. నాకు చాలా తక్కువ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఆ కారణం, మరేదో కానీ నాకు యాంటీ బాడీస్ అనుకున్న స్థాయిలో డెవలప్ కాలేదు. యాంటీ బాడీస్ 15 పాయింట్స్‌కు రీచ్ కావాలి. కానీ నాకు 8 నుండి 10 పాయింట్లే డెవలప్ అయ్యింది. పెద్దన్న(కీరవాణి), కాలబైరవకి యాంటీ బాడీస్ బాగా డెవలప్ కావడంతో వాళ్లు ప్లాస్మాను డొనేట్ చేశారు.
50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ ఓపెనింగ్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందిగా, ఇది వర్కవుట్ అవుతుందని అనుకుంటున్నారా?
- తెలియడం లేదు.. 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ ఓపెన్ చేయడం కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. విమానాల్లో రెండు, మూడు గంటల పాటు ప్రయాణిస్తున్నారు. అక్కడతో పోల్చితే థియేటర్స్ లోనే సీట్లు మధ్య ఎక్కవ గ్యాప్ ఉంటుంది. మరి అలాంటప్పుడు 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ ఓపెన్ చేయడం కరెక్ట్ కాదేమోనని అనుకుంటున్నాను. అయితే కాస్త జాగ్రత్త తీసుకోవాలని అనుకుని ఉండి, ఆ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. టెంపరరీగా కేంద్ర ప్రభుత్వం అలా సీట్ సీట్ కి ఎడం పెడితేగాని... ఎలాంటి దుష్ప్రభావం ఉండకూడదనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఉండవచ్చు.
షూటింగ్ ప్రీ వర్క్ ప్రెజర్ పెంచుతుందా?
- ప్రెజర్ ఏం లేదు. ప్రతి సినిమా చేసే సమయంలో చాలా సమస్యలుంటాయి కరోనా సమయంలో అవి ఇంకా కాస్త ఎక్కువగా ఉంటాయి. దాని కోసం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. పనిలో పడి ఎక్కడా జాగ్రత్తలు తీసుకోవడం మరచిపోతామనే దానిపై ఆలోచించి గైడ్‌లైన్స్ ఏర్పాటు చేసుకోవాలి. దాన్ని అందరూ పాటిస్తూ ఎలా ముందుకు పోవాలనేది చూడాలి. మేం షూటింగ్ ఎలా చేస్తామనే దాన్ని అందరూ గమనిస్తారు కాబట్టి, ఎక్కువ జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ చేయాల్సి ఉంటుంది. క్రూని తగ్గించే చేస్తాం. చేసే సమయంలో కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లెమ్స్ వస్తాయి. వాటిని సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్తామ్.
కరోనా వైరస్ గురించి జనాల్లో భయం తగ్గిందని అనుకుంటున్నారా?
- ఒక్కొక్క దగ్గర ఒక్కోలా ఉంది. రీసెంట్గా మేం కర్ణాటక వెళ్లినప్పుడు చాలా మంది మాస్కు ధరించడం లేదు. భౌతిక దూరం కూడా పాటించడం లేదు. నార్మల్‌గానే ఉన్నారు. అదే నల్గొండకు వెళ్లినప్పుడు 90 శాతం మంది మాస్కు వేసుకుని ఉన్నారు. జనాలు పనిలోకి వెళ్లడానికి భయపడుతున్నారు కానీ.. అటు ఇటు తిరగడానికి భయపడటం లేదు. విచిత్రమైన పరిస్థితిల్లో ఉన్నాం. అన్నీ ఇండస్ట్రీను ఓపెన్ చేసినట్లు సినిమా ఇండస్ట్రీని ఓపెన్ చేస్తే సమస్య ఏమీ ఉండదు. అదే సినిమా ఇండస్ట్రీని ప్రత్యేకంగా చూసినప్పుడు, సినిమా థియేటర్‌కు వెళితే ఆడినషనల్ డేంజరా అనే ఆలోచన ప్రజలకు కలుగుతుంది. ఎక్కడపడితే అక్కడ, మాస్కు ధరించకుండా తిరిగినప్పుడు లేని ప్రమాదం సినిమా థియేటర్‌కు మాత్రమే వెళ్లినప్పుడు వస్తుందని అనుకోవడం లేదు. ఇతర దేశాలతో ఇండియాను పోల్చలేం. ఇతర దేశాల్లో ఎంటర్టైనింగ్ కార్యక్రమాలు చాలానే ఉన్నాయి. కానీ ఇండియాలో ఎంటర్టైన్మెంట్ కోసం ఉన్న కార్యక్రమాల్లో సినిమా అనేది ముఖ్యం. జనాలు ఎదురుచూసే సినిమాతో థియేటర్స్ రన్ అయితే క్రమంగా అందరం ముందుకెళతాం.
ఓటీటీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది?
- ఓటిటి కోసం ఓ సినిమా చేస్తున్నాం. దాన్ని థియేటర్స్, ఛానెల్స్, ఓటీటీల్లో విడుద చేస్తాం. ఈ మూడింటిలో ఓటీటీ చాలా ఫాస్ట్‌గా డెవలప్ అవుతున్న మాధ్యమం. అది మేకర్స్ అడ్వాంటేజ్ అవుతుందనడంలో సందేహం లేదు. సాధారణంగా సినిమా థియేటర్లో విడుదలైతే ఎంత వసూళ్లు సాధించాయనే దాన్ని బట్టి ఓ అంచనాకు వస్తాం. శాటిలైట్ ఛానెల్లో సినిమా విడుదలైతే ఎంత మంది ప్రేక్షకులు చూస్తున్నారు. టీఆర్పీ ఎంత వచ్చిందనేది తెలుస్తుంది. కానీ ఓటీటీలో సినిమా విడుదలైతే అవేమీ తెలియదు. అలాగని ఓటీటీ తక్కువని కాదు. ఎక్కువ కథను చెప్పే ఓ మాధ్యమం మనకు దొరికింది. కొత్త టాలెంట్ బయటకు వస్తుంది.
మేకింగ్ గురించి నిర్మాతలు, దర్శకులు, ఆర్టిస్టు, టెక్నీషియన్స్ పునరాలోచించానే చర్చ జరుగుతుంది?
- ప్రతి ప్రాజెక్ట్‌ను ఒకేలా చూడలేం.నిర్మాతలు, దర్శకులు, ఆర్టిస్టు, టెక్నీషియన్స్ ఎవరైనా ఇలాగే చేస్తామని గిరి గీసుకుని కూర్చోలేరు. ఆ ప్రాజెక్ట్ ముందుకెళ్లడానికి ఏం చేయాలో అందరూ అది చేస్తారు. అదేం భయంకరమైన సిట్చ్యువేషన్ మాత్రం కాదు. చిన్న చిన్న ఇబ్బందుంటాయి అంతే.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత విమర్శలు ఎదుర్కొన్న ఆలియా భట్ ట్రిపుల్ ఆర్ సినిమాలో నటిస్తుంది కదా.. ఈ సినిమాలో నటించడం వల్ల ఆమె ఆ ఫేజ్ నుండి బయటకు వస్తుందని అనుకుంటున్నారా?
- నాకు సుశాంత్‌కు సంబంధించిన న్యూస్‌లో జనరల్ ఐడియా ఉందే తప్ప.. అదేపనిగా ఫాలో కావడం లేదు. ఆలియాభట్ ఫెంటాస్టిక్ పెర్ఫామర్. మా సినిమాలో చేయాల్సిన పాత్రకు తను వందశాతం సూట్ అవుతుంది. అందుకనే ఆమెను అప్రోచ్ అయ్యాం. తను ఎగ్జైట్ అయ్యి ఈ సినిమాలో యాక్ట్ చేయడానికి ఓకే చెప్పింది. తన పర్సనల్ లైఫ్‌లో ఏదో జరుగుతుంది కదా.. అది నా సినిమాపై ఎఫెక్ట్ చూపుతుందని అనుకోవడం లేదు. థియేటర్‌కు వచ్చే ఆడియెన్స్ వ్యక్తిగత జీవితంలో ఏదో జరుగుతుందిగా, దాన్ని బేస్ చేసుకుని సినిమా చూడాలని అనుకోడు.
లాక్డౌన్ సమయంలో దక్షిణాది సినిమాన్నీ ప్యాన్ ఇండియా సినిమాలుగా మారుతున్నాయిగా, ఏం జరిగి ఉండొచ్చు?
- మన సినిమాకు ప్యాన్ ఇండియా మూవీ అయ్యే అవకాశం ఉందని చాలా మందికి బాహుబలి నుండి వచ్చింది. చాలా రోజుల పాటు ఓ పర్టికులర్ సినిమాకే పరిమితమయ్యారు. ఎప్పుడైతే తమిళ్, కన్నడ, మలయాళ సినిమాలు హిందీలోకి అనువాదమై వాటిని చూడటం మొదలు పెట్టారో, తెలియకుండా అందరికీ సౌత్ సినిమాల్లో మనకు నచ్చే సినిమాలున్నాయనే ఆడియెన్స్ పెద్ద సంఖ్యలో తయారయ్యారు. బాహుబలి సక్సెస్ తర్వాత అదింకా పెరిగింది. లాక్డౌన్ సమయంలో అందరూ మనం చేస్తున్న సినిమా ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉందా అని ఆలోచించడం మొదలు పెట్టారు. ఇంకేం చేస్తే అది వస్తుందనే ఆలోచన వచ్చింది. అలాగే లాక్డౌన్లో ఓటీటీల్లో ఇతర భాష సినిమాలు చూసి, అరే ఇంత మంచి సినిమాలు వస్తున్నాయా అని ఆలోచించి మన సినిమాలు చూశారు. ఆడియెన్స్ ఆలోచనలు మారుతూ వచ్చాయి. అలా సౌతిండియా మేకర్స్ ఎక్కువ సినిమాలు చేయడానికి అవకాశాలు పెరిగాయి.
కేజీయఫ్ సినిమా చూసిన మీరు, వారికి సాయం చేశారని మేకర్స్ అంటున్నారు. ఆసినిమాలో మిమ్మల్ని అంతలా ప్రభావం చూపిన అంశాలేంటి?
- నేను కేజీయఫ్ యూనిట్‌కు పెద్ద సాయమేమీ చేయలేదు. చాలా చిన్నమాట సాయం చేశాను. నేను ఓ సారి కర్ణాటక వెళ్లినప్పుడు నా పక్క రూమ్‌లోనే ఉన్న యష్ నన్ను కలిసి కేజీయఫ్ సినిమా గురించి చెప్పి మూడు నిమిషాలు విజువల్స్ చూపించాడు. చూడగానే నాకు అది అందరికీ నచ్చే సినిమా అవుతుందనిపించి నాకు తెలిసిన డిస్ట్రిబ్యూటర్స్‌కి, శోభుగారికి, బాలీవుడ్లో అనీల్ టడానీకు ఫోన్ చేసి చెప్పాను. వారికి నచ్చడంతో వాళ్లు రిలీజ్ చేశారు.
‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ ఎప్పుడు ఉండొచ్చు?
- కరోనా ముందైతే నేను డేట్ చెప్పాను. కానీ ఇప్పుడు అలా చెప్పడం కష్టం. కొన్ని పద్ధతుల్లో షూటింగ్ చేయాల్సి ఉంది. అలా చేస్తున్నప్పుడు అనుకున్న సమయంలోనే షూటింగ్ చేస్తున్నానా!, అని చూసుకోవాలి. ప్రాక్టికల్ సమస్యలేంటో తొసుకోవాలి. ఇప్పుడు కంటిన్యూగా రెండు నెలు షూటింగ్ ప్లాన్ చేసుకున్నాం. ఆ రెండు నెలు షూటింగ్ అనుకున్నట్లు జరుగు తుందా అని చూసుకోవాలి. తర్వాతే రిలీజ్ డేట్‌పై అవగాహన కుగుతుంది.
లాక్డౌన్ సమయంలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఏమైనా జరిగిందా?
- కొంతే జరిగింది. వి.ఎఫ్.ఎక్స్ స్టూడియోస్ అన్నీ మూసి వేశారు. పెద్ద వర్క్ చేయడానికి అవకాశం లేకుండా పోయాయి.
‘ఆర్ఆర్ఆర్’ వెయ్యి కోట్లు కలెక్ట్ చేస్తుందని ఆర్జీవీ ట్వీట్ చేశారు. ప్రతి సినిమాకు మీరు అంచనాను మించిపోతున్నారు. ఎలా?
- ప్రతి ఒక్కరికీ వారి సినిమా రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ రావాలని ఉంటుంది. నేనూ అలా ఆలోచిస్తాను. అయితే అది సినిమా చేయడానికి నన్ను ఇన్స్పైర్ చేయదు. అలా ఆలోచించను. ఓ కథను చెప్పడానికి నేను ఎంత ఎగ్జయిట్ అవుతాననేదే ముఖ్యం.
అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ క్రేజీయస్ట్ ‘ఆర్ఆర్ఆర్’ గురించి...?
- 1920లో జరిగే ఫిక్షనల్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఇప్పటికే అల్లూరి పాత్రలో నటిస్తోన రామ్‌చరణ్ పాత్రకు సంబంధించిన ప్రోమోను చూసే ఉంటారు. అప్పుడే తారక్ పుట్టినరోజు సందర్భంగా ఆయన చేస్తున్న టీజర్‌ను విడుదల చేస్తామని అందరూ అనుకున్నారు. కానీ ఏదో చేసేయాలని కాకుండా మంచి ఔట్పుట్ ఇవ్వాలనే ఆలోచించాం. అందుకనే ముందుగానే ఆలోచించి ఆగాం. దానికి సమయం పట్టింది. ఇప్పుడు షూటింగ్‌ను స్టార్ట్ చేశాం. రామరాజు ఫర్ భీమ్ టీజర్‌కు సంబంధించిన షూటింగ్‌తో పాటు మిగతా షూటింగ్‌ను పూర్తిచేసేలా ప్రణాళికలు చేస్తున్నాం. కంటిన్యూగా రెండు నెలపాటు షెడ్యూల్‌ను ప్లాన్ చేశాం. లొకేషన్లో తగిన ప్రణాళికతో షూటింగ్‌ను పూర్తి చేస్తున్నాం.
ప్రభాస్ వరుస ప్యాన్ ఇండియా సినిమాలే చేస్తున్నారుగా.. మీకేమనిపిస్తుంది?
- ఆయనకు వేరే దారిలేదు(నవ్వుతూ).. అంత ఫ్యాన్డమ్ పెరిగిన తర్వాత కొందరికే నచ్చే సినిమాలు చేస్తాననుకోలేడు. తను లాక్ అయిపోయాడు.
‘ఆదిపురుష్’ గురించి మీతో ప్రభాస్ డిస్కస్ చేశారా?
- చేశాడు.. కానీ ఆ సినిమా గురించి వివరాల్ని మీకు నేను ఏమీ చెప్పను. అది మా ఇద్దరి మధ్య జరిగిన డిస్కషన్.
లాక్డౌన్లో వెబ్‌సిరీస్ లు చూశారా?
- చాలా వెబ్ సిరీస్‌ను చూశాను. కొన్ని నచ్చాయి. కొన్ని బోర్ కొట్టాయి. అయితే రెండు నెలలుగా చూడటం తగ్గించేశాను. ఎందుకంటే సినిమా స్టార్ట్ చేయాలను కుంటున్నాం కాబట్టి సమయం లేదు. సినిమాపై వర్క్ చేస్తున్నాను. ప్రస్తుతం మంక్ అనే పాత సిరీస్‌ను రాత్రిపూట ఓ ఎపిసోడ్ చూస్తున్నాను.
భవిష్యత్తులో ఫిలిం అకాడమీ స్టార్ట్ చేస్తారా?
- అస్సలు లేదు. టీచింగ్ అనేది పూర్తిగా వేరు. నాకు అది తెలియదు. నేను ఒక సినిమా చేస్తున్నాననుకోండి. ఉదాహరణకు ఈగ సినిమా రెండేళ్లు చేశాను. ఈ సమయంలో చాలా మంది వి.ఎఫ్.ఎక్స్ టెక్నీషియన్స్ వర్క్ చేశారు. వారందరూ మేం ఇచ్చే సమస్యలు దాటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అవుట్‌పుట్ ఇచ్చేలా రూపొందారు. ఈ ప్రయాణమే ఓ టీచింగ్. పనిచేస్తూ, నేర్చుకోవడం గురించే నాకు తెలుసు . అంతే తప్ప, ఓ స్కూల్ పెట్టి థియరీ, ప్రాక్టికల్స్ చెప్పలేను. నేను బ్యాడ్ టీచర్ని.
మహేశ్‌బాబుతో ఎలాంటి సినిమా చేయబోతున్నారు?
- ఒక సినిమా చేసేటప్పుడు మరో సినిమా గురించి ఆలోచించను. అది ముందు నుండి నాకు అలవాటు. ఇప్పుడు కూడా అంతే. ట్రిపుల్ ఆర్ పూర్తయితే కానీ, మహేశ్ సినిమా గురించి ఆలోచించను. అంత మైండ్ స్పేస్ ఉండదు. కె.ఎల్.నారాయణగారు ప్రొడ్యూసర్‌గా మహేష్‌బాబుతో ఓ సినిమా చేస్తున్నాను. అదే ప్రస్తుతానికి న్యూస్. దాని గురించి మాట్లాడటానికి సందర్భం వచ్చినపుడు చెప్తాను.
మహాభారతం సినిమా గురించి ఆలోచించారా?
- మహాభారతం నా మైండ్‌లో ఎప్పుడూ రన్ అవుతూ ఉంటుంది. ఉదాహరణకు ఓ క్యారెక్టర్ వచ్చిందంటే ఎలా చేయాలని ఆలోచిస్తాను. అలాగే ఓ సీన్ వస్తే ఎలా చేయాలని ఆలోచిస్తుంటాను. నేను ఇప్పుడు చేస్తున్న ప్రయోగాలనుండి కొత్త విషయాలు నేర్చుకుని మా అంబు పొదిలో ఓ బాణాన్ని చేర్చుకుంటున్నాను. అవన్నీ మహాభారతాన్ని చేయడానికి ఉపయోగించుకుంటాను. ఇది ఓ పదిహేనేళ్ళపాటు సాగే ప్రాసెస్.
మహాభారతంలో మీకు నచ్చిన పాత్ర ఏంటి?
- కర్ణుడు
సాధారణ పరిస్థితులు ఎప్పుడు రావచ్చు?
- దాని గురించి ఇప్పుడు ఆలోచించకపోవడమే బెటర్. ఎందుకంటే సాధారణ పరిస్థితులు ఎప్పుడొచ్చినా మార్చి ముందు ఉండే పరిస్థితులైతే రావు. కొత్త సాధారణ పరిస్థితులు , న్యూ ఫేజ్ ఆఫ్ లైఫ్ వస్తుంది. దానికి అలవాటు పడాలంటే.... సమయం పడుతుంది. అంటూ ఇంటర్వ్యూ ముగించారు ప్యాన్ ఇండియా డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి. తన పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంది తెలుగు టైమ్స్.నెట్.