34 యాప్‍లపై గూగుల్ వేటు!

Google removes 34 malware infected apps from Play Store

జోకర్‍ మాల్‍వేర్‍ ప్రభావిత యాప్‍లను ప్లేసోర్ట్ నుంచి తొలగించాలని గూగుల్‍ నిర్ణయం తీసుకుంది. ఇటీవలి కాలంలో జోకర్‍ మాల్‍వేర్‍ దాడికి గురై అనేకమంది ఆండ్రాయిడ్‍ వినియోగదారులు భారీ మొత్తంలో డబ్బు పోగొట్టుకుంటుండడంతో గూగుల్‍ దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా 34 హానికరమైన యాప్‍లను గుర్తించింది. ఇవి స్పైవేర్‍, మాల్‍వేర్‍ లాంటి హానికరమైన సాఫ్ట్వేర్‍ వ్యాప్తికి దోహదపడుతున్నాయని కనుగొంది. వీటిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే, ఆ యాప్‍ల లిస్టును విడుదల చేసి,  వినియోగదారులు వెంటనే తమ పోన్ల నుంచి ఈ యాప్‍లను తొలగించాలని విజ్ఞప్తి చేసింది.

పటిష్టమైన భద్రతా వ్వవస్థ కలిగిన గూగుల్‍ని కూడా బోల్తా కొట్టించేందుకు జోకర్‍ మాల్‍ వేర్‍ డ్రాపర్‍ అనే ఓ సరికొత్త టెక్నిక్‍ను ఉపయోగించేది. అందువల్లనే ఈ 34 యాప్‍లను ఇంతకాలం గూగుల్‍ ప్లేస్టోర్‍లో ఉండగలిగాయని విశ్లేషకులు చెబుతున్నారు. హానికరమైన ఈ 34 యాప్‍ల లిస్టును స్కాలర్‍ అనే అమెరికాకు చెందిన సైబర్‍ సెక్యూరిటీ సంస్థ గతంలోనే విడుదల చేసింది. అప్పుడు అంతగా పట్టించుకోని గూగుల్‍ ఎట్టకేలకు ఆ యాప్‍లపై చర్యలకు ఉపక్రమించింది. ఇకపై ఈ 34 యాప్‍లు ఎప్పటికీ కనిపించవని తెలిపింది.