
ప్రపంచంలో అత్యధిక ఆదాయం అందుకుంటున్న నటీమణి ఎవరంటే అమెరికన్ నటి సోఫియా వెర్గారా.. ఆమె టివి షోలు, సినిమాలు యాడ్స్ వంటి రూపంలో భారీగా ఆర్జిస్తూ సంపాదనలో నంబర్‌వన్‌గా నిలిచింది. ది మోడ్రన్ ఫ్యామిలీతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న సోఫియా ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం వార్షికాదాయం పొందుతున్న నటిగా రికార్డు సృష్టించింది. అమె ఏడాది కాలంలో 43 మిలియన్ డాలర్లు సంపాదించింది. అంటే అక్షరాల మన రూ.315 కోట్లు ఆర్జించింది. ప్రపంచంలోనే పాపులారిటీ ఉన్న ఏంజెలినా జోలీని కూడా సోఫియా దాటేసింది. ది మోడ్రన్ ఫ్యామిలీ షోలో ఒక్క ఎపిసోడ్‌కు మెర్గారా 50 వేల డాలర్లు (దాదాపు రూ.3.66 కోట్లు) పారితోషికంగా తీసుకుని రికార్డు సాధించింది. టీవి షోలతో పాటు సినిమాలు, పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటూ ఏడాది రూ.300 కోట్లకు పైగా సంపాదిస్తోంది. ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఇన్‌స్టాలో 2 కోట్ల మందికి పైగా ఫాలో అవుతున్నారు. ఇన్‌స్టామ్‌లో ప్రమోషన్లకే ఆమెకు కోట్లు తెచ్చిపెడుతున్నాయి. ఫోర్బస్ సంస్థ తాజాగా విడుదల చేసిన 2020 టాప్ 10 హయ్యస్ట్ పెయిడ్ నటీమణుల జాబితాలో మెర్గారా 43 మిలియన్ డాలర్లతో టాప్‌లో నిలిచింది.