ఆ 17 యాప్‍ల తో జాగ్రత...

Google removes 17 apps with Joker Malware from Play Store

ప్లే స్టోర్‍లోని 17 యాప్‍లలో ప్రమాదకర జోకర్‍ మాల్‍వేర్‍ ఉన్నట్టు కాలిఫోర్నియాకు చెందిన ఐటీ సెక్యూరిటీ సంస్థ గుర్తించింది. ఈ యాప్‍లను తక్షణమే తమ స్మార్ట్ ఫోన్ల నుంచి అన్‍ఇన్‍స్టాల్‍ చేయాలని యూజర్లను సూచించింది. గూగుల్‍ కూడా ఈ యాప్‍లను ప్లేస్టోర్‍ నుంచి తొలగించింది. జోకర్‍ మాల్‍వేర్‍ యాప్‍ల ద్వారా స్మార్ట్ఫోన్‍లోకి చొరబడి యూజర్ల సమాచారాన్ని దొలిగిస్తుంది. దీని ద్వారా మీ బ్యాంకు ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదముంది. ఇదివరకే ఈ మాల్‍వేర్‍ను గుర్తించినప్పటికీ, ఇది ఎప్పటికప్పుడు తన రూపు మార్చుకుని దాడి చేస్తున్నది.

మాల్‍వేర్‍ ఉన్న యాప్‍లు :

ఆల్‍గుడ్‍ పీడీఎఫ్‍ స్కానర్‍, మింట్‍ లీఫ్‍ మెసేజ్‍, యూనిక్‍ కీబోర్డ్, టాన్‍గ్రామ్‍ యాప్‍ లాక్‍, డైరెక్ట్ మెసెంజర్‍, ప్రైవేట్‍ ఎస్‍ఎంఎస్‍, వన్‍ సెంటెన్స్ ట్రాన్స్లేటర్‍, స్టైల్‍ ఫొటో కాలేజ్‍, మెటిక్యులస్‍ స్కానర్‍, డిజైర్‍ ట్రాన్స్లేట్‍, టాలెంట్‍ ఫొటో ఎడిటర్‍-బ్లర్‍ ఫోకస్‍, కేర్‍ మెసేజ్‍, పార్ట్ మెసేజ్‍, పేపర్‍ డాక్‍ స్కానర్‍, బ్లూ స్కానర్‍, హమ్మింగ్‍బర్డ్ ఎడీఎఫ్‍ కన్వర్టర్‍.