రివ్యూ : 'నిశ్శబ్డం' నో థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్

Nishabdham Movie Review

తెలుగుటైమ్స్ .నెట్ రేటింగ్ : 2.5/5

నిర్మాణ సంస్థలు : పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అండ్ కోన ఫిలిం కార్పొరేషన్

నటి నటులు : అనుష్క శెట్టి,మాధవన్,షాలిని పాండే,అంజలి,సుబ్బరాజు,శ్రీనివాస్ అవసరాల,మైఖేల్ మ్యాడ్‌సన్ తదితరులు సంగీతం : గోపిసుందర్, గిరీష్ సహా నిర్మాత : వివేక్ కూచిబొట్ల నిర్మాతలు : టీజీ విశ్వ‌ప్ర‌సాద్, ‌కోన వెంకట్.. రచన, స్క్రీన్ ప్లే : కోన వెంకట్, హేమంత్‌ మధుకర్‌. దర్శకుడు: హేమంత్ మధుకర్

ఓ టి టి వేదిక : అమెజాన్ ప్రైమ్ వీడియో

విడుదల తేదీ : 02.10.2020

లాక్‌డౌన్‌కు ముందు ఫైనల్ కాపీ రెడీ చేసుకుని విడుదల తేదీ కూడా ఖరారు చేసుకున్న సినిమాలన్నీ ఇప్పుడు వరుసపెట్టి ఓటీటీల్లో విడుదలవుతున్నాయి. ‘నిశ్శబ్దం’ సైతం ఈ కోవకు చెందించే. ఎప్పుడో జనవరి లో విడుదల కావాల్సిన ఈ సినిమా. అది కాస్త ఏప్రిల్ వాయిదా పడింది. కరోనా వైరస్ వల్ల విడుదలే ఆగిపోయింది. మొత్తానికి థియేటర్‌లో విడుదల చేసే ఆలోచనను పక్కనపెట్టి ఓటీటీలో ప్రయత్నించారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళ భాషల్లో ఈ సినిమా అక్టోబర్ 2న విడుదలైంది.

కథ:

కథ మొత్తం అమెరికాలోని సీటల్, సీక్విమ్ నగరాల మధ్య నడుస్తుంది. సాక్షి (అనుష్క) చెవిటి, మూగ అమ్మాయి. కానీ, మంచి పెయింటర్. మరోవైపు ఆంటొని (మాధవన్) సెలబ్రిటీ మ్యుజీషియన్.. మిలియనీర్. వీరిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. ఎంగేజ్‌మెంట్ తరవాత వీరిద్దరూ కలిసి సరదాగా ట్రిప్‌కు వెళ్తారు. ఈ ట్రిప్‌లో భాగంగా భూతాల కొంపగా పేరొందిన ఒక పాత ఇంటికి వీరిద్దరూ వెళ్తారు. ఆ ఇంటిలో 1972లో భార్యాభర్తలు హత్యకు గురవుతారు. ఇప్పుడు అదే ఇంటిలో ఆంటొని కూడా హత్యకు గురవుతాడు. కానీ, సాక్షి తప్పించుకుంటుంది. అసలు ఆంటొనిని ఎవరు చంపారు? మూగ అమ్మాయి అయిన సాక్షి పోలీసులకు ఎలా సహకరించింది? అసలు ఆ హంతకుడు ఎవరు? అనే విషయాలు సినిమాలోనే చూడాలి.

నటి నటుల హావభావాలు:

ఇక నటీనటుల విషయానికి వస్తే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అనుష్క గురించి. చెవిటి, మూగ అమ్మాయిగా అనుష్క బాగా నటించారు. కాస్త బొద్దుగా అందంగా వుంది కాబట్టి ఆ పాత్రలో డెప్త్ కనిపించలేదు. పైగా నటనకు ఎక్కువ ప్రాధాన్యం లేదు. సైన్ లాంగ్వేజ్‌తోనే సన్నివేశాలు నడిచిపోతాయి. మాధవన్ – అనుష్క మధ్య కెమిస్ట్రీ మరియు అనుష్క క్యారెక్టర్ లోని షేడ్స్ ఈ సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి. హావభావాలు, భావోద్వేగాలు పెద్దగా పండలేదు. మాధవన్, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజు, మైఖేల్ మ్యాడ్‌సన్.. ఇలా ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. కాకపోతే, ఏ ఒక్క పాత్ర మనపై పెద్దగా ఇంపాక్ట్ చూపించదు. ప్రధానంగా సాక్షి, ఆంటొని పాత్రలే కనిపిస్తాయి. ఆఖరికి హాలీవుడ్ యాక్టర్ మైఖేల్ మ్యాడ్‌సన్ పాత్ర సైతం పెద్దగా ఆకట్టుకోదు.

సాంకేతిక వర్గం పనితీరు:

తన గత చిత్రాలతో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన దర్శకుడు హేమంత్ మధుకర్.. ‘నిశ్శబ్దం’ కథను మాత్రం చాలా క్రియేటివ్‌గా రాసుకున్నారు. అయితే, ఇలాంటి కథకు పర్ఫెక్ట్‌గా సరిపడా స్క్రీన్‌ప్లేను కోన వెంకట్ ఇవ్వలేకపోయారనే చెప్పాలి. సినిమాలో మెయిన్ పాయింట్ అండ్ ప్లే బాగా ఆకట్టుకున్నా… మధ్యలో కొన్ని సీన్స్ మాత్రం బోర్ గా సాగుతాయి. అలాగే క్యారెక్టర్స్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూస్ ను ఎలివేట్ చేస్తూ దర్శకుడు అనుకున్న సీన్స్ లో కొన్ని చోట్ల ఇంకా బెటర్ గా ఉంటే బాగుండేది అనే ఫీలింగ్ కలుగుతుంది. అలాగే కొన్ని సన్నివేశాలు స్లోగా ఉండటం, మరియు కొన్ని సన్నివేశాల్లో ఇంట్రస్ట్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలుస్తాయి.‘నిశ్శబ్దం’ గురించి ప్రధానంగా చెప్పుకోవాలంటే నిర్మాణ విలువల గురించి మాట్లాడుకోవాలి. విజువల్స్ అంత గొప్పగా ఉన్నాయి. టెక్నికల్‌గా సినిమా అద్భుతంగా ఉందనే చెప్పాలి. ముందు చెప్పుకున్నట్టుగా విజువల్స్ అదిరిపోయాయి. షనీల్ డియో కెమెరా పనితనం అంత గొప్పగా ఉంది. అలాగే, గిరీష్ గోపాలక్రిష్ణన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరో ప్లస్. అయితే, ఈ నేపథ్య సంగీతాన్ని బాగా ఎంజాయ్ చేయాలంటే దానికి తగిన సౌండ్ సిస్టమ్ మన దగ్గర ఉండాలి. లేదంటే మంచి క్వాలిటీ హెడ్‌సెట్ వాడాలి. ఇదిలా ఉంటే, గోపీ సుందర్ అందించిన పాటలు బాగున్నాయి. ముఖ్యంగా సిద్ శ్రీరామ్ ఆలపించిన ‘నిన్నే నిన్నే’ సాంగ్ చాలా బాగుంది. ఎడిటర్ ప్రవీణ్ పూడి సినిమాను ఎడిటింగ్ బాగుంది.

విశ్లేషణ :

థ్రిల్లర్ మూవీస్‌ క్లైమాక్స్ వరకు సస్పెన్స్‌ను మెయింటైన్ చేస్తూ ఒక్కో చిక్కు ముడిని విప్పుకుంటూ వెళ్తేనే కిక్కు. అలాంటి కిక్కు ‘నిశ్శబ్దం’లో సగం నుంచే మాయమైంది. ఆంటొని హత్యకు కారకులు ఎవరో తెలిసిన తరవాత ఇక ఆ తరవాత జరిగే కథ అంతా ఊహాజనితమే. సహజంగా ఇలాంటి సినిమాలు చివరాఖరులో థ్రిల్లింగ్ ఉండాలి కానీ ఈ చిత్రంలో పెద్దగా కిక్కు ఇవ్వదు. అయితే, మొదటి గంటన్నర పాటు సినిమా ఆసక్తికరంగానే సాగింది. సినిమా తొలి సన్నివేశంతోనే హారర్ మూవీ అనే భావనను కలిగించారు దర్శకుడు. ఎప్పుడో 48 ఏళ్ల క్రితం జరిగిన హత్యలు, మూతబడిన ఇల్లును తమకు అనుగుణంగా వాడుకొని ఆంటొనీని ఎలా హత్య చేశారు అనే విషయాన్ని బాగానే కన్విన్సింగ్‌గా చెప్పారు. ఈ క్రమంలో వచ్చే ట్విస్ట్‌లు ప్రేక్షకుడికి థ్రిల్‌ని ఇస్తాయి. కాకపోతే ఆ ట్విస్ట్‌లు రివీల్ చేసే విధానం ఏవో ముక్కలు తెచ్చి అతికించినట్టుగా అనిపిస్తుంది. ఒక ఫ్లోలో వెళ్తున్నట్టు ఉండదు. ‘నిశ్శబ్దం’ గురించి ప్రధానంగా చెప్పుకోవాలంటే నిర్మాణ విలువల గురించి మాట్లాడుకోవాలి. విజువల్స్ అంత గొప్పగా ఉన్నాయి. సినిమా మొత్తాన్ని సీటల్, సీక్విమ్ నగరాల పరిసర ప్రాంతాల్లో తెరకెక్కించడంతో హాలీవుడ్ లుక్ వచ్చింది. దీనికి తోడు తెలుగు నటీనటులతో సమానంగా ఇంగ్లిష్ కాస్టింగ్ కూడా ఉండటంతో ఇంగ్లిష్, తెలుగు సినిమా కలిపి చూస్తున్న అనుభూతి కలుగుతుంది.