నిశ్శ‌బ్ధం లో క‌థ‌లో ప్ర‌తి పాత్ర ఆస‌క్తిక‌రంగా ఉంటాయి - అనుష్క‌

Anushka Interview about Nishabhdam Movie

* మీ నిశ్శబ్ధం ఎలా మైదలైంది 

- భాగ‌మ‌తి త‌రువాత కావాల‌ని గ్యాప్ తీసుకున్నా, ఆ స‌మయంలో కోన‌వెంక‌ట్ గారు, హేమంత్ గారితో ఈ స్టోరీ నెరేష‌న్ ఇప్పించారు, ఇందులో నా క్యారెక్ట‌ర్ ఢిప‌రెంట్ గా ఉండ‌టంతో పాటు సినిమా కూడా వ‌ర్క్ అవుట్ అవుతుంద‌ని నాకు బ‌లంగా అనిపించింది, అందుకే ఈ ప్రాజెక్ట్ లో న‌టించ‌డానికి ఒప్పుకున్నాను, అనుకోకుండా నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన స్టోరీ ఇది, అంతేకాదు అనుకోకుండానే నచ్చేసింది.

* సినిమా కోసం మ్యూట్ గా టించారు, అందుకోసం సైన్ లాగ్వెంజెస్ నేర్చుకున్నార నిజమేనా

- నా క్యారెక్ట‌ర్ డంబ్, డెఫ్ గా ఉంటుంద‌ని ముందుగానే డైరెక్ట‌ర్ హేమంత్ చెప్పారు, న‌న్ను ఈ సినిమాలోకి వచ్చేలా చేసింది కూడా నా క్యారెక్ట‌ర్ కి ఉన్న ఈ స్పెషాలిటియే, ఇందుకోసం నేను కొన్నాళ్లు పాటు ఇండియ‌న్ సైన్ లాగ్వెంజ్ నేర్చుకున్నాను, అయితే ఆ త‌రువాత షూటింగ్ కి అమెరికా వెళ్లాక అక్క‌డ సైన్ లాంగ్వేజ్ వేరుగా ఉంటుంద‌ని తెలిసింది, ఇంట‌ర్నేష‌న‌ల్ గా అంద‌రూ ఎక్కువుగా వాడే సైన్ లాంగ్వేజ్ కూడా అదే కావ‌డంతో, మ‌ళ్లీ అమెరికాలో ఓ 14 ఏళ్ల అమ్మాయి ద‌గ్గ‌ర ఇంట‌ర్నేష‌న‌ల్ సైన్ లాంగ్వేజ్ లో ట్రైనింగ్ తీసుకుని న‌టించాను.

* మీ కెరిర్ లో తొలిసారిగా మీరు టించిన సినిమా డైరెక్ట్ గా ఓటిటిలో విడుద అవుతుంది, ఎలా ఫీల్ అవుతున్నారు

- ఓటిటి, థియేట‌ర్ రెండు వేరు వేరుగా ఉన్న‌ప్ప‌టికీ, ఓటిటిలో సినిమాలు విడుద‌ల చేయ‌డాన్ని కూడా అంతా పాజిటివ్ గా చూడాల్సిన అవ‌స‌రం ఉంది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల రీత్య‌, సినిమా ఇండ‌స్ట్రీ ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్లాలంటే, టెక్నాల‌జీ ప‌రంగా ఆడియెన్స్ కి ఎంట‌ర్ టైన్మెంట్ ఇవ్వ‌డంలో ఇలాంటి మార్పులు రావ‌డం అవ‌సరం, వాటిని అంతా సంపూర్ణంగా స్వాగ‌తించ‌డం కూడా అత్యఅవ‌స‌రం. ఇక తొలిసారిగా నేను న‌టించిన సినిమా ఇలా విడుద‌లవ్వ‌డం నాకు కాస్త కొత్త‌గా అనిపిస్తోంది, అలానే మేము చేసిన ఈ కొత్త ప్ర‌య‌త్నాని ఆడియెన్స్ అంతా స్వాగ‌తిస్తారు అని ఆశిస్తున్నాను.

* నిశ్శబ్ధంలో మీరు ళ్లీ మాధన్ తో లిసి టించారు, వారితో మీ ర్కింగ్ ఎక్స్ పీరియెన్స్ ఎలా ఉంది

- మాధ‌వ‌న్ గారితో నా కెరీర్ తొలినాళ్ల‌లో క‌లిసి న‌టించాను, మ‌ళ్లీ ఇన్నాళ్లు త‌రువాత క‌లిసి న‌టించ‌డం చాలా వండ‌ర్ ఫుల్ గా అనిపించింది, ఇద్దరం ఈ సినిమాలో ఛాలెంజింగ్ రోల్స్ చేశాము, అలానే సినిమాలో ఉన్న పాత్ర‌కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది, ఈ క‌థ కేవలం మా ఇద్ద‌రి చుట్టూనే తిరిగుతూ ఉండదు, స్క్రీప్ ప్లే ముందుకు న‌డిపించ‌డంలో మిగ‌తా పాత్ర‌లు కూడా కీల‌కంగా మారుతుంటాయి, ఈ థ్రిల్లింగ్ రైడ్ ని ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తార‌ని క‌చ్ఛితంగా చెప్ప‌గ‌ల‌ను.

* థ్రిల్లర్స్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది, సినిమాలో మ్యూజిక్ గురించి ఏం చెబుతారు

- ఓటిటిలో విడుద‌ల అవ్వ‌డంలో ఉన్న ఒకే ఒక డ్రాబ్యాక్ ఇదే, థియేట‌ర్స్ లో ఉండే సౌండ్ సిస్ట‌మ్, ఆడియో క్వాలిటీని ఆడియెన్స్ మిస్ అవుతారు, అయితే హెడ్ ఫోన్స్, హోమ్ థియేట‌ర్స్ ఈ లోపాన్ని దాదాపుగా క‌వ‌ర్ చేస్తాయి. ఇక ఈ సినిమాకు మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్స్ పెద్ద ఎస్సెట్స్, మ‌రి ముఖ్యంగా గోపీ సుంద‌ర్ ఇచ్చిన ఆర్ ఆర్ సినిమాను మ‌రింత ఆస‌క్తిక‌రంగా మార్చేసింది.

* సినిమా ర్శ‌, నిర్మాతలు గురించి చెప్పండి

- ద‌ర్శ‌కుడు హేమంత్ ఫుల్ క్లారిటీతో వ‌ర్క్ చేసుకుంటూ పోతారు, త‌న‌కు ఏం కావ‌ల‌న్నది యాక్ట‌ర్స్ నుంచి తీసుకోవ‌డం హేమంత్ స్పెషాలిటీ, ఆయ‌న డైరెక్ష‌న్ లో ఈ ప్రాజెక్ట్ అత్యఅద్భుతంగా వ‌చ్చింది. ఇక నిర్మాతలు కోన ఫిల్మ్ కార్పోరేష‌న్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ గురించి వేరే చెప్పాల్సిన అవ‌స‌రం లేదు, ఈ ఎక్స్ పెర‌మెంట‌ల్ స్టోరీని అమెరికా బ్యాక్ డ్రాప్ లో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ అవ్వ‌కుండా సినిమాను నిర్మించం అంత సులువు కాదు, దానికి చాలా ప్యాష‌న్ అలానే ధైర్యం కావాలి, ఆ రెండు ఉన్న నిర్మాత‌లు వీరిద్ద‌రు, చివ‌రిగా ఆక్టోబ‌ర్ 2ను ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో మా నిశ్శబ్ధం విడుద‌ల అవుతుంది, ఫార్వాడ్ చేయకుండా ఈ సినిమాను ఆడియెన్స్ అంతా ఓ ఫ్లోలో చూడాల‌ని మ‌న‌వి చేస్తున్నా.

 


                    Advertise with us !!!