Ex Union Minister Jaswant Singh Dies at 82

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్‍ నేత జస్వంత్‍సింగ్‍ (82) ఆదివారం ఉదయం కన్ను మూశారు. 2014లో ఢిల్లీలోని తన నివాసంలో బాత్రూంలో కాలుజారి పడిన ఆయన మెదడులో రక్తస్రావం జరిగి కోమాలోకి వెళ్లిపోయారు. జూన్‍లో పరిస్థితి దిగజారడంతో ఆర్మీ ఆస్పత్రిలో చేర్పించారు. ఆదివారం ఉదయం 6:55 గంటలకు ఆయనకు తీవ్ర గుండెపోటు వచ్చిందని ఆర్మీ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆయనకు ఇద్దరు కొడుకులు. పెద్ద కుమారుడు మానవేంద్రసింగ్‍ మాజీ ఎంపీ.