Former Union Minister Uma Bharti Tests COVID 19 Positive

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్‍ నాయకురాలు ఉమా భారతి కరోనా బారినపడ్డారు. తనకు వైరస్‍ సోకిందని ట్విటర్‍లో వెల్లడించారు. జ్వరంగా ఉండడంతో కొవిడ్‍ పరీక్ష చేయించుకున్నానని, అందులో పాజిటివ్‍ వచ్చిందని పేర్కొన్నారు. దీంతో స్వీయ నిర్బంధం లోకి వెళ్లినట్లు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు పరీక్ష చేయించుకొని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.