ap cabinet meeting on oct 1

ఆంధప్రదేశ్‍ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అక్టోబర్‍ 1న జరగనుంది. ముఖ్యమంత్రి వైఎస్‍ జగన్‍మోహన్‍రెడ్డి అధ్యక్షతన ఆ రోజు ఉదయం 11 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్‍లో కేబినెట్‍ సమావేశం ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని తెలిపారు. కేబినెట్‍ మెమొరాండంను ఈ నెల 29 మధ్యాహ్నం మూడు గంటల్లోగా ఇంగ్లిష్‍, తెలుగుల్లో పంపాలని అన్ని శాఖలను ఆదేశించారు.