Comic book on Kamala Harris to be released a day after her birthday

మిస్టర్ బిడెన్ ఉపాధ్యక్ష నామినీ కమలా హారిస్ పుట్టినరోజు సందర్భంగా ఆమె చిన్నతనం నుండి అమెరికా ఉపాధ్యక్ష నామినీ వరకు సాగిన జీవిత ప్రయాణం ఆధారంగా ఒక కొత్త కామిక్ పుస్తకం విడుదల కాబోతుంది. టైడల్ వేవ్ ప్రొడక్షన్స్ లో “ఫిమేల్ ఫోర్స్: కమలా హారిస్” పేరుతో ఒక కామిక్ పొలిటికల్ పవర్ సిరీస్ ని అమెరికా అధ్యక్ష ఎన్నికలకు(నవంబర్ 3 ) రెండు వారాల అంటే అక్టోబర్ 21 న టైడల్ వేవ్ సంస్థ విడుదల చేయనున్నారు.

అక్టోబర్ 20 న కమలా హారిస్ 55 నిండి 56 లో కి అడుగుపెట్టనున్నారు. కఠినమైన సంకల్పం , అర్ధవంతమైన విధానం మరియు ద్వి జాతి వారసత్వం తో నిండిన కమలా హారిస్ జీవితం, ప్రారంభ దశ నుండి అంటే కాలిఫోర్నియాలో భారతీయ డాక్టర్ శ్యామల గోపాలన్ మరియు జమైకన్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ డొనాల్డ్ హారిస్‌లకు జన్మించినప్పటి నుండి రెండవ మహిళా ఆఫ్రికన్-అమెరికన్ మరియు మొదటి ఆసియా-అమెరికన్ యు.ఎస్. సెనేటర్‌గా పదవి చేపట్టి డెమొక్రాటిక్ పార్టీలో ప్రముఖ సభ్యురాలుగా ఎదగడానికి ఆమె ఎంచుకున్న మార్గాన్ని మరియు ఆమె ఎదురుకున్న ఒడుదుడుకులని ఈ కామిక్ పుస్తకం లో ప్రచురించనున్నారు అని పబ్లిషర్ వివరించారు.

డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష నామినేషన్ పోటీలో హారిస్ ఫ్రంట్ రన్నర్ మిస్టర్ జో బిడెన్‌ను ఎదురుకున్న సంఘటనలతో పాటు ఈ కామిక్ సిరీస్‌లో అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, 2016 ఎన్నికల్లో హారిస్‌ డెమొక్రాటిక్ ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ మరియు 2008 యు.ఎస్. రిపబ్లికన్ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి సారా పాలిన్ పాత్రలు కూడా ఉంటాయి అని పబ్లిషర్ వివరించారు.