ipl effect on ott platform release movies

కోవిడ్ -19 పాపమో పుణ్యమో గాని మంచి ఎక్సపెక్ట్ వున్నా సరికొత్త సినిమాలన్నీ కూడా నేరుగా ఓటీటీ లలోనే విడుదల అవుతున్నాయి. కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన చాలా మంది టీవీలలో సరైన ప్రోగ్రామ్స్ లేక ఆల్రెడీ చూసిన సినిమాలనే మళ్ళీ చూడలేక ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు వినియోగదారులుగా మారిపోయారు. ఐతే తమ చందాదారుల సంఖ్య పెంచుకోవాలని.. అలాగే తమ పాత చందాదారులకు సరికొత్త సినిమాలను చూపించాలన్న ఉద్దేశంతో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు కోట్ల రూపాయలను వెచ్చించి మరీ సరికొత్త సినిమాల డిజిటల్ రైట్స్ ని దక్కించుకుంటున్నాయి.

హీరో నాని నటించిన ఈ సినిమాని ముప్పై మూడు కోట్లకు అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అనుష్క శెట్టి నటించిన నిశ్శబ్దం, రాజ్ తరుణ్ ఒరేయ్ బుజ్జిగా సినిమాలు కూడా కోట్లు వెచ్చించి కొనుగోలు చేస్తున్నరు. నిశ్శబ్దం సినిమా కు దాదాపు 25కోట్ల రూపాయలిచ్చి రైట్స్ సొంతం చేసుకుందని వినికిడి. ఇప్పటి వరకు అనేక సినిమాలను కోట్ల రూపాయలను వెచ్చించి కొనుగోలు చేసిన ఓటీటీ సంస్థలు ఇకపై నిర్మాతలకు ఎక్కువ డబ్బులు ఇవ్వడానికి సిద్ధమవ్వడం లేదట.

ప్రస్తుతం ఎంతో ప్రేక్షకాదరణ కలిగిన ఐపీఎల్, బిగ్ బాస్ లతో పాటు అన్ని సీరియళ్లు, ప్రోగ్రామ్స్ ప్రారంభమయ్యాయి. దీంతో పనికి పోయి ఇంటికి వచ్చిన వారు టీవీలకే అతుక్కుపోతున్నారు. ఇంట్లో ఉన్న ఆడవారు కూడా టీవీ సీరియళ్లను చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. ఫలితంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లను చూసేవారు కరువైపోయారు. అందుకే ప్రస్తుతం సినిమాలను చాలా అతి తక్కువ ధరలకే కొనుగోలు చేయాలని ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఒక ఫ్లాప్ హీరో సినిమాని కళ్ళు చెదిరే రేటుకు కొనుగోలు చేస్తామని ఓ పెద్ద ఆఫర్ ఇచ్చిన ఓటీటీ సంస్థ ఇప్పుడు సగానికి సగం ధర కూడా ఇవ్వడానికి సిద్ధపడటం లేదట. దాంతో ఆ సినిమా నిర్మాతలు ఎక్కువ ఆఫర్ వచ్చినప్పుడే విక్రయించినట్లు అయితే లాభపడేవాళ్ళమని ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నారట.

ప్రదీప్ హీరోగా నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాని అప్పట్లో 6 కోట్లు పెట్టి కొనుగోలు చేస్తామన్న వారు ఇప్పుడు మూడు కోట్ల కంటే ఎక్కువ ధరకు కొనుగోలు చేసే ప్రసక్తే లేదని తెగేసి చెప్తున్నారట. సో, ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు.. మీడియం రేంజ్ సినిమాలకైనా బడా స్టార్ల సినిమాలకైనా ఎక్కువ ధరలకు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపక పోవడంతో నిర్మాతలకు భారీ షాక్ తగిలినట్లయింది.