ram charan in ajit tamil movie

టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోల్లో రామ్ చరణ్ గురించే చెప్పొచ్చు హీరోగా నిర్మాతగా కెరీర్ ని ప్లాన్ చేస్తూ ముందుకు వెళుతున్నాడు. తండ్రి సలహాలను తీసుకుంటూ గతంలో కంటే ఇప్పుడు సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. వినయ విధేయ రామ చిత్రం నేర్పిన గుణపాఠం తో ఇక ముందు చేయబోయే సినిమాల విషయం లో ఎంతో జాగ్రత్త తీసుకుంటున్నాడు. ప్రతి ఒక్కటి కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తూ వస్తున్నాడు. గతంలో మాదిరిగా సినిమాల విషయంలో తేలికగా తీసుకోకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నాడు. ప్రస్తుతం మన తెలుగులో రామ్ చరణ్ రెండు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ అనే సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా వేసింది చిత్ర యూనిట్. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ అనిల్ రావిపూడి దర్శకత్వం లో కూడా ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఆ సినిమా కథ ఇప్పటికే దాదాపుగా రెడీ అయింది.

అయితే ఇప్పుడు తమిళంలో కూడా నటించడానికి సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయ్. గత కొంత కాలంగా రామ్ చరణ్ తమిళం కన్నడంలో మార్కెట్ పెంచుకోవడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఒక తమిళ సినిమాలో నటించడానికి ఆసక్తి చూపించాడు. అయితే ఇది గెస్ట్ రోల్ అని తెలుస్తుంది. అజిత్ సినిమాలో గెస్ట్ రోల్ చేయడానికి రామ్ చరణ్ రెడీ అయినట్లు తెలుస్తుంది. ఆ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా రామ్ చరణ్ నటించే అవకాశం ఉంది. ధ్రువ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా రామ్ చరణ్ నటనకు చాలా మంచి పేరు వచ్చింది. ఆ రెఫెరెన్సు తోనే ఆ సినిమాలో ఒక పది నిమిషాల పాటు ఉండే అతిధి పాత్రలకు రామ్ చరణ్ ని ఎంపిక చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.