Trump intends to nominate Amy Coney Barrett for Supreme Court

అమెరికా సుప్రీంకోర్టులో అమీ కోన్‍ బారెట్‍ను న్యాయమూర్తిగా నియమించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ నిర్ణయించారు. ఇవాళ గానీ రేపు గానీ అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. దివంగత న్యాయమూర్తి జస్టిస్‍ రూత్‍ బాడర్‍ గిన్బ్బర్గ్ స్థానంలో అమీ నియమితులవుతారు. కొత్త న్యాయమూర్తి నియామకాన్ని ప్రతిపక్ష డెమోక్రాటక్‍ పార్టీ, దాని అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‍ వ్యతిరేకిస్తున్నారు. అమీ కోన్‍ బారెట్‍ని సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా మార్చడానికి ట్రంప్‍కు ఇప్పుడు సెనేట్‍ అనుమతి అవసరం. రిపబ్లికన్‍ పార్టీలో మెజారిటీ ఉన్నందున సాంకేతికంగా ఇది కష్టం కాదు. ఎన్నికలకు కొద్ది వారాలు మాత్రమే మిగిలి ఉన్న తరుణంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల డెమోక్రాటిక్‍ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. అమీ పేరును ఒకట్రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించవచ్చు.

ట్రంప్‍కు చెందిన కొందరు సీనియర్‍ అధికారులు వరుసగా రెండు రోజులుగా అమీతో సంప్రదింపులు జరిపినట్లుగా తెలుస్తున్నది. శుక్రవారం అమీ నియమాకం గురించి ట్రంప్‍ను ప్రశ్నించినప్పుడు.. ప్రత్యక్ష సమాధానం ఇవ్వకుండా దాటేశారు. కొన్ని నెలలుగా అధ్యక్ష ఎన్నికల రేసులో వెనుకబడి ఉన్న ట్రంప్‍ అమీ కోన్‍ బారెట్‍ పేరు నుంచి ప్రయోజనం పొందవచ్చని నిపుణులు, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.