BJP makes DK Aruna its National VP Purandeswari is General Secretary

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన జాతీయ నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన డీకే అరుణ, పురందేశ్వరిలకు చోటు దక్కింది. తెలంగాణకు చెందిన డీకే అరుణను జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా పురందేశ్వరిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్‍ కె.లక్ష్మణ్‍ను ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆంధప్రదేశ్‍కు చెందిన సత్యకుమార్‍ జాతీయ కార్యదర్శిగా యథావిధిగా కొనసాగనున్నారు. మొత్తం 12 మందిని జాతీయ ఉపాధ్యక్షులుగా, 8 మందిని జాతీయ ప్రధాన కార్యదర్శులుగా, ముగ్గురు జాయింట్‍ జనరల్‍ సెక్రటరీలుగా జేపీ నడ్డా నియమించారు. జాతీయ కార్యదర్శులుగా 13 మందికి అవకాశం ఇచ్చారు. జాతీయ అధికార ప్రతినిధులుగా 23 మందికి స్థానం కల్పించారు. వీటితో పాటు బీజేపీకి చెందిన ఇతర విభాగాలకు అధ్యక్షులను, ఇన్‍ఛార్జులను నియమించారు. ఈ మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‍ సింగ్‍ ఉత్తర్వులు జారీ చేశారు.