Coronavirus Positive Cases in Telangana

తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 58,925 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 2,239 పాజిటివ్‍ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,83,866కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‍ విడుదల చేసింది. కరోనాతో  నిన్న ఒక్కరోజే 11 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,091కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజే 2,181 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,52,441కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 30,334 యాక్టివ్‍ కేసులు ఉన్నాయని, వారిలో 24,683 మంది హోం ఐసోలేషన్‍లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 28,00,761కి చేరింది. కోవిడ్‍ మరణాల రేటు 0.59 శాతం ఉండగా రికవరీ రేటు 82.90 శాతంగా ఉందని వెల్లడించింది.