USA Extends Ban on Work Visas

విదేశీ విద్యార్థులు, పరిశోధకులు, జర్నలిస్టుల వీసాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ మరో కఠిన నిర్ణయం తీసుకున్నారు. వీరికి జారీ చేసే వీసాలకు కచ్చితమైన చివరి తేదీని నిర్ణయించాలని ప్రతిపాదించారు. వీసా గడువు ముగిసిన తర్వాత కూడా కొంతకాలం గడువు పొడిగింపులతో అమెరికాలో ఉండటానికి వీలు కల్పిస్తున్న ప్రస్తుత నిబంధనలను రద్దు చేయాలని నిర్ణయించారు. నిబంధనల్లో ఉన్న లోపాలను ఆసరాగా చేసుకొని విదేశీయులు అమెరికాలోనే దీర్ఘకాలం ఉండిపోవటం వల్ల అమెరికన్లకు నష్టం కలుగుతున్నదని ట్రంప్‍ యంత్రాంగం ఆరోపిస్తున్నది. ముఖ్యంగా చైనా పౌరులను టార్గెట్‍ చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు.