US announces $150 million for H1B One Workforce training

దేశ ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధికి దోహదం చేసే కీలకమైన రంగాల్లో నైపుణ్యాల మెరుగుదలకు అగ్రరాజ్యం అమెరికా కసరత్తు చేస్తున్నది. ఇందులో భాగంగా మధ్య స్థాయి నుంచి ఉన్నత స్థాయి నైపుణ్యాలు అవసరమయ్యే హెచ్‍ 1బీ ఉద్యోగాల్లో మానవ వనరులకు శిక్షణ ఇచ్చేందుకు రూ.1,105 కోట్లు వినియోగించనున్నట్టు ఆ దేశ కార్మికశాఖ వెల్లడించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఐటీ, సైబర్‍ భద్రత, ఆధునిక నిర్మాణాలు, రవాణా తదితర కీలక రంగాల్లో ప్రస్తుతం, భవిష్యత్‍లో అవసరమయ్యే మానవ వనరుల సామర్థ్యాన్ని పెంచేందుకు హెచ్‍ 1బీ వన్‍ వర్క్ఫోర్స్ పేరిట ఈ నిధులను ఖర్చు చేస్తామని పేర్కొంది.