CM KCR And Jagan Condolence To SP Balu Death

ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్‍, వైఎస్‍ జగన్‍ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఎన్నో సుమధుర గేయాలు ఆలపించిన బాలు భారతీయ ప్రజలందరికీ అభిమాని అయ్యారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‍ అన్నారు. బాలు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదని చెప్పారు. గాయకుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా సేవలందించిన గొప్ప వ్యక్తి బాలు అని ఆయన కొనియాడారు. బాలు కుటుంబ సభ్యులకు కేసీఆర్‍ తన ప్రగాఢ సానూభూతి తెలియజేశారు.

బహుముఖ ప్రతిభ ద్వారా ఐదు దశాబ్దాలుగా బాలు అద్భుతమైన సినీ సంగీతాన్ని సామాన్య ప్రజలకు అందించారని ఆంధప్రదేశ్‍ ముఖ్యమంత్రి వైఎస్‍ జగన్‍ కొనియాడారు. 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడిన సంగీత ప్రియుల మృదయాల్లో ఆయన సుస్థిర స్థానం సంపాదించుకున్నారన్నారు. దేశం ఓ మేరునగధీరున్ని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాలు కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి జగన్‍ తన ప్రగాఢ సానూభూతి తెలిపారు.