24-yr-old temple employee in Kerala wins Rs 12-cr Onam lottery jackpot

కేరళ ఇడుక్కికి చెందిన అనంత్‍ అనే యువకుడికి ఈ ఏడాది ఓనం లాటరీ వరించింది. ఎర్నాకులంలోని ఓ ఆలయంలో పనిచేస్తున్న అతడు ఈ లాటరీ ద్వారా రూ.12 కోట్లు గెలుచుకున్నాడు. ఈ సొమ్ముతో మంచి ఇల్లు కట్టుకొని తమ పిల్లలకు ఉన్నత చదువులు చెప్పిస్తామని యువకుడి తల్లిదండ్రులు తెలిపారు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తన ఎంబీఏ కలను సైతం అనంత్‍ వదులుకున్నాడు. ఆలయంలో పనిచేస్తూ కుటుంబానికి అండగా ఉంటున్నాడు. అతడి తండ్రి పెయింటర్‍గా కాగా తల్లి ప్రైవేటు వస్త్ర దుకాణంలో పని చేస్తున్నారు. చాలీచాలని జీతాలతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఇలాంటి దీన పరిస్థితితుల్లో లాటరీ తగలడంపై అనంత్‍ కుటుంబం సంతోషం వ్యక్తం చేస్తోంది. లాటరీ నగదుతో తమ కలలను నిజం చేసుకుంటామని సంబరపడుతోంది.