Bihar Elections 2020

బిహార్‍లో ఎన్నికల నగారా మోగింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నేడు షెడ్యూల్‍ విడుదల చేసింది. 243 అసెంబ్లీ స్థానాలున్న బిహార్‍లో మూడు విడతల్లో ఎన్నికలు జరుగునున్నాయని చీఫ్‍ ఎలక్షన్‍ కమిషనర్‍ సునీల్‍ అరోరా ప్రకటించారు. అక్టోబర్‍ 28న తొలిదశలో 71 స్థానాలకు, నవంబరు 3న రెండో దశలో 94 స్థానాలకు, నవంబరు 7న మూడో దశలో 78 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇక నవంబరు 10న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తారు. నేటి నుంచే ఎన్నికల కోడ్‍ అమల్లోకి వస్తుందని తెలిపారు.