Nobel winners to get $110000 raise as prize money increased

నోబెల్‍ 2020 అవార్డు విజేతలకు నగదు పారితోషికం ఈసారి పెరగనుంది. గత ఏడాది అందించిన మొత్తంతో పోలిస్తే ఇప్పుడు దీనిని పెంచాలని నిర్ణయించినట్లు నోబెల్‍ పురస్కార నిర్వాహకులు తెలిపారు. త్వరలోనే ఈ ఏటి నోబెల్‍ పురస్కారాల విజేతల పేర్లు వెల్లడికానున్నాయి. వివిధ రంగాలలో ప్రతిభను కనబర్చి, విశిష్ట సేవలు అందించిన వారికి నోబెల్‍ పురస్కారం అందిస్తున్నారు. ఒక్కో అవార్డుకు ఈ ఏడాది రూపాయాలలో చూస్తే 8,13,19,755 అందుతాయి. స్వీడన్‍ కరెన్సీలో కోటి క్రోనార్స్, డాలర్లలో 1.1 మిలియన్లు విజేతలకు అందుతాయి. ప్రతిభావంతుల విజయాలను మరింత బాగా గుర్తిచేసుకుంటూ, ఇటువంటి ఫలితాలను మరింత ప్రోత్సహించేందుకు, ఎందరో స్ఫూర్తి పొందేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని నోబెల్‍ ఫౌండేషన్‍ కార్యనిర్వాహక సంచాలకులు లార్స్ హికెన్‍స్టెన్‍ తెలిపారు.