Donald Trump says he expects US election to end up at supreme court

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ ఏడాది నవంబర్‍ 3వ తేదీన జరగనున్నాయి. ఒకవేళ ఆ ఎన్నికల్లో రిపబ్లికన్‍ పార్టీ అభ్యర్థి, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ ఓడిపోతే ఏం జరుగుతుందో తెలుసా. ఈ అంశానికి సంబంధించి ట్రంప్‍నే ఓ జర్నలిస్టు ప్రశ్నించారు. అధికార బదిలీ సజావుగా సాగుతుందా అని ట్రంప్‍ను ప్రశ్నించగా, దానిపై కామెంట్‍ చేసేందుకు రిపబ్లికన్‍ నేత నిరాకరించారు. ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే అన్నారు. వైట్‍హౌజ్‍లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అమెరికా ఎన్నికల ఫలితాలను బహుశా సుప్రీంకోర్టు తేల్చే అవకాశాలు ఉన్నట్లు ఆయన డౌట్‍ వ్యక్తం చేశారు.

కరోనా నిబంధనల నేపథ్యంలో ఈసారి అమెరికా ఎన్నికల కోసం పోస్టల్‍ ఓటింగ్‍ నిర్వహించనున్నారు. ఈ-మెయిల్‍ ఓటింగ్‍పై ట్రంప్‍ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్‍ బ్యాలెట్‍ ద్వారా డెమోక్రటిక్‍ అభ్యర్థి బైడెన్‍ గెలిచే అవకాశాలు ఉన్నట్లు ట్రంప్‍ విమర్శించారు. డెమోక్రటిక్‍ పార్టీ పోస్టల్‍ బ్యాలెట్‍తో రిగ్గింగ్‍కు  పాల్పడుతుందని ఆరోపించారు. బ్యాలెట్ల గురించి చాలా బలమైన వ్యతిరేక స్వరాన్ని ట్రంప్‍ వినిపించారు. బ్యాలెట్లతో పెను నష్టం జరిగే ఛాన్సు ఉన్నట్లు ఆయన తెలిపారు. బ్యాలెట్‍ విధానాన్ని తీసివేస్తే చాలా శాంతియుతంగా ఎన్నికలు జరుగుతాయని, అప్పుడు అధికార బదిలీ ఉండదని, కేవలం కొనసాగింపు మాత్రమే ఉంటుందని ట్రంప్‍ అన్నారు.