Russian state media makes parody video showing Trump working as News Anchor

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‍ ఓటమి పాలైతే రష్యా ప్రభుత్వ టీవీ ఛానెల్‍లో ఆయనకు యాంకర్‍గా ఉద్యోగం ఆఫర్‍ వచ్చింది. ఈ ఆఫర్‍ చేసినందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్‍కు ట్రంప్‍ ధన్యవాదాలు తెలిపారు. ఇదంతా నిజం కాదండోయ్‍. ట్రంప్‍ భవిష్యత్తుపై రష్యా మీడియా చేసిన స్పూఫ్‍ (వెటకారం) వీడియో. ఈ వీడియోలో ఓ వ్యక్తి అచ్చం ట్రంప్‍లాగా ప్రవర్తిస్తూ నా లాంటి నిరుద్యోగికి టీవీ యాంకర్‍ ఉద్యోగమిచ్చిన పుతిన్‍ గారికి ధన్యవాదాలు అని హాస్యభరితంగా చెప్పిన డైలాగు నవ్వులుపూయిస్తోంది.