Coronavirus Positive Cases in Telangana

తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కరోనా నిర్థారణ పరీక్షల్లో కొత్తగా 2,296 పాజిటివ్‍ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,77,070కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‍ విడుదల చేసింది. వైరస్‍ ప్రభావంతో కొత్తగా 10 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,062కు చేరింది. కరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజే 2,062 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,46,135కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 29,873 యాక్టివ్‍ కేసులు ఉన్నాయని, వారిలో 23,527 మంది హోం ఐసోలేషన్‍లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఒకే రోజు 55,892 టెస్టులు చేయగా, మొత్తం 26,28,897 శాంపిల్స్ పరీక్షించినట్లు పేర్కొంది. రాష్ట్రంలో కొవిడ్‍ మరణాల రేటు 0.59 శాతం ఉందని, రికవరీ రేటు 82.52 శాతంగా ఉందని వైద్యశాఖ తెలిపింది.