Trump panicked in the face of Covid 19 says Joe Biden

అమెరికాలో ఇంతవరకు ఏడు లక్షల వరకు కరోనా కేసులు పెరిగి పోవడమే కాకుండా రెండు లక్షల మంది కరోనాకు బలికావడం ఆందోళన కలిగిస్తోందని, కరోనా నియంత్రణలో ట్రంప్‍ ప్రభుత్వం భయపడుతోందని అమెరికా డెమొక్రటిక్‍ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‍ తీవ్రంగా ధ్వజమెత్తారు. కరోనా మహమ్మారితో మనం చాలాకాలం గడపవలసి రావడం ఆందోళన కలిగిస్తోందని, ఇది దేశంలోని అనేక ప్రాణాలను బలిగొంటున్నా మనం మౌనంగా చూస్తూ ఉండవలసి వస్తోందని బిడెన్‍ విస్కన్సిన్‍ ర్యాలీలో అన్నారు. ఈ విస్కన్సిన్‍ రాష్ట్రం కీలకమైనది. 2016 ఎన్నికల్లో ఇక్కడ నుంచే ట్రంప్‍ విజయం సాధించారు.