Democrats release digital ads in 14 Indian languages to woo South Asian voters in US

అమెరికా అధ్యక్ష  ఎన్నికల్లో భారతీయులతో పాటు దక్షిణాసియా ప్రజల మనసులను గెలవడానికి డెమోక్రాటిక్‍ పార్టీ వినూత్న పంథాలో అడుగులేస్తోంది. అందులో భాగంగా 14 భారతీయ భాషల్లో తమ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‍ గురించి రూపొందించిన డిజిటల్‍ ప్రచార ప్రకటనలు విడుదల చేసింది. దీని గురించి బైడెన్‍ ప్రచార బృందంలో కీలక సభ్యుడైన అజయ్‍ జైన్‍ భుటోరియా మాట్లాడుతూ ఇప్పటికే విడుదల చేసిన ఛలో ఛలో బైడెన్‍ కో ఓట్‍ దో అనే పాట మంచి ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు జాగో అమెరికా, జాగో.. భూల్‍ న జానా బైడెన్‍-హారిస్‍ కో ఓట్‍ దేనా పేరుతో తాజా ప్రకటనలు విడుదల చేశాం అని చెప్పారు.