Hyderabad IT employees still prefer work from home Survey

కోవిడ్‍ 19 కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటి నుంచి పని చేయడమే మేలు. ఇదీ భాగ్యనగరిలో ఐటీ, ఐటీఈఎస్‍ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల మనోగతం అని హైదరాబాద్‍ సాఫ్ట్‌వేర్ ఎంటర్‍ప్రైజెస్‍ అసోసియేషన్‍ (హైసియా) ఆధ్యయనంలో తేలింది. 95 శాతం కంపెనీలు వర్క్ ఫ్రం హోం విధానంలో కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. 90-100 ఉద్యోగులు ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. రెండు నెలలుగా ఇంటి నుంచి పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య పెరిగింది. ఉద్యోగుల ఉత్పాదకత 75 శాతం ఉన్నట్టు 80 శాతం కంపెనీలు తెలిపాయి. పెద్ద కంపెనీల్లో ఇది 90 శాతంగా ఉంది. బ్రాడ్‍బ్యాండ్‍, విద్యుత్‍ కోతలు, ఇంట్లో నెలకొన్న వాతావరణం ఉద్యోగులకు అడ్డంకిగా మారాయి. ఉద్యోగుల్లో ధైర్యం తగ్గిందని 34 శాతం మంది తెలిపారు. సుమారు 70 శాతం పెద్ద కంపెనీలు గత 6 నెలల్లో ఫ్రెషర్లను నియమించాయి.  కొన్ని కంపెనీలు 1,000 మంది వరకు రిక్రూట్‍ చేసుకున్నాయి. ఆఫర్‍ లెటర్లు అందుకున్న ఫ్రెషర్లను నియమిస్తామని చాలా కంపెనీలు తెలిపాయి అని పేర్కొంది.