GATA team decided to give moral support to these young students with groceries and daily essentials

గ్రేటర్‍ అట్లాంటా తెలుగు అసోసియేషన్‍ (జీఏటీఏ) ఔదార్యం చాటుకున్నది. అట్లాంటాలోని లిండ్‍బర్గ్స్టేషన్‍కు సమీపంలోని ఈవోఎన్‍ అపార్ట్మెంట్‍ కాంప్లెక్స్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వకోల్పోయిన 150 మంది తెలుగు విద్యార్థులకు, యువశ్రామికులకు బాసటగా నిలిచింది. నిత్యావసర, కిరాణా సరుకులను అందజేసింది. సన్నిహితులు, స్నేహితుల నుంచి చద్దర్లు, రైస్‍కుక్కర్లు, ఇన్‍స్టా పాట్స్, తదితర వస్తువులను సేకరించి బాధితులకు అండగా నిలిచిన రేణుక, సరస్వతికి జీఏటీఏ కృతజ్ఞతలు తెలిపింది.