Kachidi fish rate is Rs 1 70 Lakhs

ఆంధప్రదేశ్‍ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా చీరాల మండలం వాడరేపు తీరంలో దోనిదేవుడు అనే మత్స్యకారుడి వలకు మంగళవారం 28 కిలోల కచ్చిలి చేప చిక్కింది. దీనిని కొనుగోలు చేసేందుకు పలువురు పోటీ పడ్డారు. చివరకు అదే ప్రాంతానికి చెందిన దారకొండ అనే వ్యాపారి రూ.1.70 లక్షలకు దక్కించుకున్నారు. ఈ చేప పొట్ట భాగాన్ని మందుల తయారీలో వినియోగిస్తారని, అందుకే అంత గిరాకీ అని మత్స్యకారులు తెలిపారు.