Alia Bhatt out of SS Rajamouli s RRR amid Sadak 2 backlash

బాహుబ‌లి వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌తో రాజ‌మౌళి స్టార్ట్ చేసిన ఆర్ ఆర్ ఆర్ పై దేశ‌వ్యాప్తంగా భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఏర్ప‌డ్డాయి. భారీ తారాగ‌ణంతో, భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ స‌ర‌స‌న హాలీవుడ్ న‌టి ఒలివియా మోరిస్‌, రామ్‌చ‌ర‌ణ్‌కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ అలియా భ‌ట్ న‌టించ‌నున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు ఈ సినిమా షూటింగ్ 60 శాతం పూర్త‌యింది. లాక్‌డౌన్ కార‌ణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. త‌దుప‌రి షెడ్యూల్‌ను పూణెలో చేయాల‌ని నిర్ణ‌యించారు. ఆ సమ‌యంలోనే లాక్‌డౌన్ రావ‌డంతో ఆ ప్ర‌య‌త్నాన్ని విరమించుకున్నారు. ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డిన త‌ర్వాత షూటింగ్ మొద‌లుపెట్టాల‌నుకున్నారు. ఆమ‌ధ్య కొన్ని ష‌ర‌తుల‌తో కేంద్ర ప్ర‌భుత్వం షూటింగుల‌కు అనుమ‌తించ‌డంతో ఫూణె షెడ్యూల్‌ను స్టార్ట్ చెయ్యాల‌నుకుంది చిత్ర యూనిట్. కానీ, కొన్ని కార‌ణాల వ‌ల్ల అది సాధ్యం కాలేదు. ఇప్ప‌టివ‌ర‌కు అలియాభ‌ట్ ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ అవ్వ‌లేదు. పూణె షెడ్యూల్‌లో ఆమె పాల్గొంటుంద‌ని అనుకున్నారు. ఈలోగా అలియాభ‌ట్ ఆర్ ఆర్ ఆర్ నుంచి త‌ప్పుకుంద‌న్న వార్త‌లు ఊపందుకున్నాయి.

బాలీవుడ్‌లో అలియా సినిమాల‌తో బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె గంగూభాయ్‌, బ్ర‌హ్మాస్త్ర చిత్రాల‌లో న‌టిస్తోంది. ఆమెకు ఉన్న క‌మిట్‌మెంట్స్ ప్ర‌కారం డేట్స్ కేటాయించింది. లాక్‌డౌన్ కార‌ణంగా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ఆగిపోవ‌డంతో ఈ సినిమాకి ఆమె ఇచ్చిన డేట్స్ అయిపోయాయ‌ని, అందుకే ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. త‌ను ఈ సినిమా చేయ‌లేన‌ని, త‌న నెక్స్‌ట్ ప్రాజెక్ట్‌కి వెళ్ళిపోతాన‌ని రాజ‌మౌళిని కోరిన‌ట్టు చెప్పుకుంటున్నారు. అయితే ఈ వార్త‌ల్లో నిజంలేద‌ని తెలిసింది. ఆర్ ఆర్ ఆర్ కోసం బ‌ల్క్‌గా డేట్స్ కేటాయించింద‌ని, రాజ‌మౌళి న‌వంబ‌ర్ నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయ‌బోతున్నాడ‌ని స‌మాచారం. ముందుగా అలియాభ‌ట్ కాంబినేష‌న్‌లో ఉన్న స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌బోతున్నార‌ని తెలుస్తోంది. అంటే అలియాభ‌ట్ ఆర్ ఆర్ ఆర్ సినిమాలో చేయ‌డం లేద‌న్న వార్త‌ల్లో ఎలాంటి నిజం లేద‌నేది క్లారిఫై అయ్యింది.