NCB Revealed Namratha Name In Bollywood Drugs

దేశ‌వ్యాప్తంగా ఇప్పుడు డ్ర‌గ్స్ కేసు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. సుశాంత్ రాజ్‌పుత్ మేనేజ‌ర్ జ‌య‌సాహాను ఎన్‌సిబి అధికారులు విచారించిన విష‌యం తెలిసిందే. ఈ విచార‌ణ‌లో జ‌య‌సాహా కొంత‌మంది సినీ ప్ర‌ముఖుల పేర్ల‌ను వెల్ల‌డించాడు. అందులో టాలీవుడ్ హీరోయిన్లు ర‌కుల్ ప్రీత్ సింగ్‌, మ‌హేష్ స‌తీమ‌ణి న‌మ్ర‌త పేర్లు కూడా ఉండ‌డం టాలీవుడ్ వ‌ర్గాల‌ను క‌ల‌వ‌ర‌పెడుతోంది. ఎప్పుడూ వార్త‌ల్లోకి రాని న‌మ్ర‌త పేరు డ్ర‌గ్స్ విష‌యంలో బ‌య‌టికి రావ‌డంతో నెటిజ‌న్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. డ్ర‌గ్స్‌కి ఎడిక్ట్ అయిన న‌మ్ర‌త‌ను అరెస్టు చేయాల‌ని ర‌క‌ర‌కాల కామెంట్స్ పెడుతున్నారు. ఈ విష‌యంలో మ‌హేష్ ఫ్యాన్స్ తీవ్రంగా స్పందిస్తున్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా నేష‌న‌ల్ మీడియాలో న‌మ్ర‌త పేరు వినిపించ‌డం, దానికి దేశ‌వ్యాప్తంగా ఉన్న మీడియా మ‌రింత ప్ర‌చారం క‌ల్పించ‌డంతో సినీ ప‌రిశ్ర‌మ అల్ల‌క‌ల్లోలంగా మారింది. సూప‌ర్‌స్టార్ కృష్ణ నుంచి మ‌హేష్ వ‌ర‌కు అభిమానిస్తూ వ‌స్తున్న వీరాభిమానులు న‌మ్ర‌త‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌ను జీర్ణించుకోలేక‌పోతున్నారు. త‌ల్లి లాంటి వ‌దిన‌మ్మ‌పై అస‌త్య ప్ర‌చారం చేస్తే ఊరుకోబోమ‌ని వారు హెచ్చ‌రిస్తున్నారు.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల‌లో అత‌ని ప్రియురాలు రియా చ‌క్ర‌వ‌ర్తిని అరెస్ట్ చేయ‌డంతో డ్ర‌గ్స్ ఉదంతం వెలుగులోకి వ‌చ్చింది. రియాకు స‌న్నిహితంగా మెలిగిన ర‌కుల్ ప్రీత్‌కు కోర్టు స‌మ‌న్లు కూడా పంపించింది. ఇదిలా ఉంటే త‌న‌కు డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంతో ఎలాంటి సంబంధం లేద‌ని, అధికారిక ప్ర‌క‌ట‌న లేకుండా త‌న‌పై ఇలాంటి ఆరోప‌ణ‌లు చేయ‌డం స‌రికాద‌ని ర‌కుల్ వాదిస్తోంది. టాలీవుడ్ ప్ర‌ముఖుల‌పై డ్ర‌గ్స్ ఆరోప‌ణ‌లు రావ‌డం ఇప్పుడు కొత్తేమీ కాదు. రెండేళ్ళ క్రితం డ్ర‌గ్స్ ఉప‌యోగిస్తున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌పై ర‌వితేజ‌, పూరి జ‌గ‌న్నాథ్‌, సుబ్బ‌రాజు, ముమైత్‌ఖాన్‌, ఛార్మి, త‌రుణ్‌తోపాటు మ‌రి కొంత‌మంది టాలీవుడ్ ప్ర‌ముఖులు విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. ఇప్పుడు టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్ స‌తీమ‌ణి న‌మ్ర‌త ఈ ఆరోప‌ణ‌లు ఎదుర్కోవ‌డం అంద‌ర్నీ క‌ల‌వ‌రపెడుతోంది. టాలీవుడ్‌కి చెందిన ఇంకా కొంత‌మంది ప్ర‌ముఖులకు ఈ డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంతో సంబంధాలు ఉన్న‌ట్టు స‌మాచారం.