Keerthy Suresh to play Sita in Prabhas Adipurush

టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్ కు ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో ఎంతటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఆయనతో ఒక సినిమా అవకాశం వస్తే చాలు అంటూ ఎందరో దర్శకనిర్మాతలు ఎదురు చూపులు చూస్తున్నారు. అదే విధంగా హీరోయిన్స్ కూడా డార్లింగ్ తో నటించాలని ఉర్విళ్ళు ఉర్వుతున్నారు. ఇక ఇటీవల బాహుబలి రెండు భాగాల సినిమాలతో విపరీతమైన క్రేజ్ దక్కించుకున్న ప్రభాస్, ప్రస్తుతం నటిస్తున్న లేటెస్ట్ సినిమా రాధేశ్యామ్. యువి క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ బ్యానర్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ ఒక డిఫరెంట్ లో నటిస్తున్నట్లు టాక్. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో భాగ్యశ్రీ, ప్రియదర్శి, మురళి శర్మ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తుండగా సీనియర్ రెబల్ స్టార్ కృష్ణంరాజు ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు.

వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని అనంతరం యువ దర్శకడు నాగ అశ్విన్ దర్సకత్వంలో ఒక భారీ సైన్స్ ఫిక్షన్ సినిమా చేయనున్న ప్రభాస్, దాని తరువాత బాలీవుడ్ దర్శకడు ఓం రౌత్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న హిస్టారికల్ డ్రామా మూవీ ఆదిపురుష్ లో నటించనున్నారు. ఆ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్ర చేస్తుండగా బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ రావణాసురుడి పాత్ర చేయనున్నాడు. ఎంతో భారీ ఖర్చుతో ప్రముఖ నిర్మాత భూషణ్ కుమార్ నిర్మించనున్న ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా నటించే సీత పాత్రధారి విషయమై ఇప్పటికే పలువురు హీరోయిన్స్ ని పరిశీలించిన దర్శకుడు రౌత్, ఇటీవల ఆ పాత్రకు గాను మహానటి ఫేమ్ కీర్తి సురేష్ ని ఫైనల్ చేసారని, అతి త్వరలో ఆ విషయమై అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఈ సినిమా పట్టాలెక్కనున్నట్లు టాక్. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో నిజానిజాలు కంఫర్మ్ కావడానికి మరి కొన్ని రోజులు వేచిచూడాల్సిందే!!